తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అపజయం అనేది తెలియకుండా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించారు దర్శకధీరుడు రాజమౌళి.  అంతే కాగా ఈగ చిత్రంతో అద్భుతమైన ప్రయోగం చేశారు.  ఇప్పటి వరకు సినిమాల్లో హీరోల హవా ఉండేది..అయితే ఈ చిత్రంలో మాత్రం చిన్న ఈగనే హీరోగా చూపించాడు. అంతే కాదు తెలుగు ఇండస్ట్రీలో అత్యద్భుతమైన టెక్నాలజీ, గ్రాఫిక్స్ వాడుతున్నట్లు జాతీయస్థాయిలో నిరూపించాడు. ఇక బాహుబలి, బాహుబలి 2 చిత్రాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
Image result for baahubali 2
 ప్రపంచంలో తెలుగు చిత్రాల స్థాయిని అమాంతంగా పెంచేశాయి.  ఇప్పుడు ఎక్కడ చూసినా బాహుబలి మానియా నే కొనసాగుతుంది.  అయితే ఈ చిత్రంలో బాహుబలి, భల్లాలదేవ పాత్రలకు ఎంతో పేరు వచ్చిందో..శివగామిన (రమ్యకృష్ణ) పాత్రకు కూడా అంతే గొప్ప పేరు వచ్చింది.  అయితే ఈ పాత్ర కోసం అతిలోక సుందరి శ్రీదేవిని మొదట సంప్రదించగా ఆమె  డిమాండ్లు విని ఆశ్చర్యపోయామని మీడియాకు చెప్పారు రాజమౌళి. 
Image result for sivagami
రీసెంట్ గా మామ్ చిత్రం ప్రమోషన్ గురించి హైదరబాద్ వచ్చిన శ్రీదేవి కొన్ని ఇంటర్వ్యూల్లో రాజమౌళి అంత గొప్ప దర్శకులు ఇలాంటి చీఫ్ మాటలు మాట్లాడుతాడు అనుకోలేదని ఆయన సినిమాలంటే ఎంతో గౌరవిస్తానని అంతే కాదు నేను శివగామి పాత్ర కోసం డబ్బు డిమాండ్ చేసినట్లు ప్రచారం చేయడం చాలా తప్పని నన్ను ఎంతో బాధకు గురిచేసిందని అన్నారు.  
Image result for sridevi
అంతే కాదు డబ్బు డిమాండ్ చేసే వ్యక్తినైతే ఇండస్ట్రీలో యాభై ఏళ్లుగా  ఉండేదాన్ని కాదు అంటూ చెప్పడంతో ఈ విషయం రాజమౌళి చెవిన పడింది.  దీంతో తాను శ్రీదేవి పట్ల అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని విచారం వ్యక్తం చేస్తున్నాడు . రమ్యకృష్ణ కంటే ముందుగా శ్రీదేవి నే అడిగారు శివగామి పాత్రకు కానీ ఆ పాత్ర రమ్యకృష్ణ నే వరించింది . 

https://www.youtube.com/watch?v=5bdb7CoOWX8


మరింత సమాచారం తెలుసుకోండి: