తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి అక్కినేని నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చారు.   ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.  అన్నమయ్య,రామదాసు, షిరిడీసాయి, ఓం నమో వెంకటేశాయ లాంటి భక్తిరస చిత్రాల్లో నటించి మెప్పించారు.  మన్మధుడు, కింగ్ నాగార్జునగా అని అభిమానులు ముద్దుగా పిలుస్తారు.  ఇక నాగార్జున వారసులుగా ఎంట్రీ ఇచ్చారు అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్.  తెలుగు ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు అక్కినేని నాగ చైతన్య.
Image result for sisindri akhil
 సిసింద్రి చిత్రంలో చిన్నపుడే తన సత్తా ఏంటో చాటాడు అఖిల్.  మనం చిత్రంలో క్లయిమాక్స్ లో కనిపించిన అఖిల్ మాస్ డైరెక్టర్ వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ చిత్రంలో నటించాడు.  ఈ చిత్రంలో అఖిల్ కి పేరు వచ్చింది..కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.  తాజాగా విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ కుర్ర హీరో నటిస్తున్నాడు.  

మనం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన విక్రమ్ కె.కుమార్ ఇప్పుడు అఖిల్ కి మంచి హిట్ అందించడం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తునాడు. తాజగా విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నాగార్జున నిర్మిస్తున్న చిత్రం ఫ‌స్ట్‌లుక్ విడుద‌లైంది. విడుద‌ల‌కు ముందే ఈ ఫ‌స్ట్‌లుక్ ఆన్‌లైన్‌లో లీక‌వ‌డంతో అఖిల్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో అధికారికంగా షేర్ చేశాడు.
Image result for manam movie climax scene
 అంతే కాదు ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆగ‌స్టు 21న తెలియ‌జేస్తామ‌ని అఖిల్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఓ ప‌క్క హీరోయిన్ ముద్దు పెడుతుండ‌గా, మ‌రో ప‌క్క గూండాల‌ను కాలితో కిక్ కొడుతున్నట్లు ఉన్న ఈ ఫ‌స్ట్‌లుక్ స్టిల్‌కు అభిమానుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంది.నాగార్జున కూడా ఈ స్టిల్‌ను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: