Image result for prabhas images



రాజమౌళి రసవత్తర సినిమా బాహుబలిలో తన అత్యద్భుత నటనతో మొత్తం ప్రపంచాన్నే ఉర్రూతలూగించిన భారత విఖ్యాత యువనటుడు "యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్"  ఖ్యాతి క్రేజ్ ఇప్పుడు దక్షిణ భారతం నుండి ఉత్తర భారతానికి ఆ పై విశ్వవ్యాప్తం గా పాకింది. బాహుబ‌లి సినిమాలో ప్ర‌భాస్ న‌ట విశ్వ‌రూపం ఇప్పుడు ఈ కథానాయకుణ్ణి హీరోని "నేష‌న‌ల్ స్టార్" గా మార్చింది. ప్ర‌భాస్ కోసం బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ఇప్పుడు క్యూ క‌డుతున్నారు. 


Image result for Top ten most popular film stars of india


అయితే ఈ మధ్య "ఇండియా టుడే" నిర్వహించిన ఒక స‌ర్వే ప్రకారం 2016-2017 సంవ‌త్స‌రానికి గాను "మోస్ట్ పాపుల‌ర్ హీరోలు" గా ప‌లువురిని భారతీయ నటులను ఎంపిక చేసింది. అందులో "ప్ర‌భాస్ టాప్ టెన్" లో స్థానం ద‌క్కించుకోవ‌డం విశేషం. అమితాబ్ బ‌చ్చ‌న్, స‌ల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అక్ష‌య్ కుమార్ త‌ర్వాత ఐద‌వ స్థానంలో ప్ర‌భాస్ ఉన్నాడు. 


Image result for Top ten most popular film stars of india

ఇంకా ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌య‌మేమంటే మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ క‌న్నా ప్ర‌భాస్ టాప్ లో ఉన్నాడు. ప్ర‌స్తుతం సుజీత్ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో "సాహో" అనే ద్విబాషా చిత్రం లో నటిస్తున్న ప్ర‌భాస్ రీసెంట్ గా టీం తో షూటింగ్లో పాలు పంచు కుంటున్నాడు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను తొలుతగా తెర‌ కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇంకా కథానాయికను ప్రకటించలేదు  


Image result for akshay kumar




మరింత సమాచారం తెలుసుకోండి: