తెలుగు బుల్లితెరపై ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రపంచ పాపులర్ రియాల్టీ షో అయిన ‘బిగ్ బాస్’ టాక్ వినిపిస్తుంది.  ఈ కార్యక్రమానికి మొట్ట మొదటి సారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  మొదట్లో ఈ షో పై పెద్దగా అభిమానులకు ఇంట్రెస్టింగ్ ఉండేది కాదు. కానీ రోజు రోజు కీ ఈ బిగ్ బాస్ లో వస్తున్న ట్విస్ట్ లు, ఎలిమినేషన్స్ చూస్తుంటే ఆ ప్రోగ్రామ్ పై క్యూరియాసిటీ పెరిగిపోతుంది.
Image result for telugu bigg boss show contestants
ఇక ఎన్టీఆర్ శని, ఆదివారల్లో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పటికే బిగ్ బాస్ హౌజ్ నుంచి జ్యోతి, సమీర్, మధు ప్రియ, కత్తి మహేష్, సింగర్ కల్పన ఎలిమినేట్ అవగా..బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మాత్రం తన ఆరోగ్య పరిస్థితి బాగోలేక బిగ్ హౌజ్ నుంచి బయటకు వచ్చాడు.  నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యారు.  
Image result for telugu bigg boss show contestants
నిన్న జరిగిన టాస్క్ చాలా ఎంట్రటైన్ మెంట్ గా సాగింది. ఎన్టీఆర్   ఇంటి సభ్యులకు సంబంధించిన చిట్టీలు తీసి బోను లో నిలబెట్టి మరో కంటెస్టంట్ అతనుపై ఆరోపణలు చేస్తాడు..దానికి బోనులో ఉన్న కంటెస్టంట్ వివరణ ఇవ్వాలి. ఇలా ఒక్కోక్కరూ ఇక్కో కాంప్లెంట్స్ ఇచ్చారు.  ఆ తర్వాత ఎన్టీర్ మరో టాస్క్ ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న నవదీప్ పై ఇచ్చారు.
Image result for telugu bigg boss show contestants
  దీని ప్రకారం బిగ్ బాస్ సభ్యులు నవదీప్ కి ఒక్కొక్క ఐటమ్ తగిలించాలి.  ఇలా హరిప్రియ సూపర్ మాన్ డ్రాయర్ తొడిగింది..ముమైత్ ఖాన్ కూల్ గ్లాస్ తొడిగింది..దీక్ష బొట్టు పెట్టింది, ధన్ రాజ్ మీసాలు పెట్టాడు..కత్తి కార్తిక పూలమాల, ప్రిన్స్ గధ, శివబాలాజీ తలపై టోపీ పెట్టాడు. ఇలా నవదీప్ తో ఇంటి సభ్యులు భలే ఆడుకున్నారు..ట్విస్ట్ ఏంటంటే అంతకు ముందే నవదీప్ తో ఎన్టీఆర్ కూడా ఓ రేంజ్ లో ఆడేసుకున్నాడు.  
Image result for telugu bigg boss show contestants
నవదీప్ ని ఎమర్జెన్సీగా  బ్యాగ్ సర్ధుకొని బయటకు రావాలని..మీ ఇంట్లో పాత 500, 1000 నోట్లు దొరికాయని టెన్షన్ పెట్టాడు. దీంతో హౌజ్ సభ్యులు, చూస్తున్న ప్రేక్షకులు కూడా ఒక్క నిమిషం షాక్ కి గురయ్యారు.
Image result for telugu bigg boss show contestants
 తర్వాత అదంతా ఉత్తిదే అని నవదీప్ ఎంట్రీ ఇచ్చిన రోజు బయట ఈ నోట్లు గురించి హౌజ్ సభ్యులకు చెప్పడంతో..ఇప్పుడు ఆ విషయంపై ఎన్టీఆర్ నవదీప్ తో ఆడుకున్నాడు. మొత్తానికి నాలుగు వారాల నుంచి బిగ్ బాస్ హౌజ్ లో సందడి చేసిన ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కావడం కాస్త బాధ అనిపించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: