తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ అయిన చిత్రాలపై రివ్యూలు రాస్తూ..ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొన్న సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తి మరోసారి పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ పై మండి పడ్డారు. ఇప్పటికే పవన్ విషయంలో జోక్యం చేసుకున్న ఆయనకు పవన్ ఫ్యాన్స్ నుంచి పెద్ద యుద్దమే అయ్యింది. దీంతో పవన్ ఫ్యాన్స్ తనను టార్చర్ పెడుతున్నారని గతంలో మహేశ్ కత్తి మీడియా ముందుకు వచ్చి ఆవేదన చెందిన విషయం తెలిసిందే. కత్తి మహేష్ ‘బిగ్ బాస్ ’ షో లో పాల్గొన్నప్పటి నుంచి కాస్త పాపులర్ అయిన విషయం తెలిసిందే.
ఇప్పుడు అదే ఫ్యాన్స్ రేణూ దేశాయ్ పై ఇటువంటి కామెంట్లు చేయడం చూస్తోంటే పీకే ఫ్యాన్స్ పిచ్చి పీక్స్ లో ఉన్నట్లు తనకు అనిపిస్తోందని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా ఎప్పుడైతే తన నిర్ణయాన్ని తెలిపిందో.. అభిమానులు అనేక రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు అనుకూలంగా కొందరు ప్రతికూలాంగా స్పదింస్తున్నారు.
‘పవన్ కళ్యాణ్‌ని అన్నయ్యగా, మిమ్మల్ని వదినగా భావిస్తున్నాం. మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటే మీపై ఉన్న గౌరవం మొత్తం పోతుంది. . ఆ అభిమానాన్ని మిస్ చేసుకోవద్దు” ఇలాంటి ట్వీట్లు కనిపిస్తున్నాయి. అంటూ ట్విట్స్ పెట్టడంపై ఇప్పటికే రేణు దేశాయ్ అభిమానులపై మండిపడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడీ విషయంలో సినీ ఎనలిస్ట్ కత్తి మహేష్ దూరాడు.పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రేణూ దేశాయ్ పర్సనల్ లైఫ్‌లోకి ఎందుకు వెళుతున్నారని నిలదీశాడు మహేశ్ కత్తి . ‘
పవన్ తో విడాకులు తీసుకున్న తర్వాత.. ఏడు సంవత్సరాల ఒంటరి జీవితం తర్వాత రేణూ దేశాయ్ పెళ్లి చేసుకుంటానంటే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి ఏమిటి అభ్యంతరం? ఆ తిట్టడం ఏమిటి! ఆ ట్రాల్స్ ఏమిటి? ఇంత మూర్ఖత్వం ఏమిటి? ఇంత పర్వార్టెడ్ భావజాలం ఏమిటి? ఇవేవీ కనిపించనంతగా మీ కళ్ళు మూసుకుపోవడం ఏమిటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది’ అని పేర్కొన్నాడు. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఫాన్స్ రియాక్షన్ ఎలా వుంటుందో చూడాలి.