ఆ మద్య మళియాల నటి భావనపై ఆమె డ్రైవర్ ప్లాన్ ప్రకారం కారులో బంధించి లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై భావన పెద్ద ఉద్యమం చేసింది..అన్ని ఇండస్ట్రీలు ఆమెకు సపోర్ట్ గా నిలిచాయి. భావన పై లైంగిక దాడి చేసిన వారిని చట్టం శిక్షించే వరకు పోరాటం చేసింది. ఇక నటి భావన చూపించిన తెగువకు చాలా మంది హీరోయిన్లు ప్రేరణ పొందారు. గతంలో తమపై జరిగిన లైంగిక దాడులు, ఇండస్ట్రీలో తాము పడ్డ భాదలు ఒక్కోక్కటీ చెబుతూ వచ్చారు.
ఈ నేపథ్యంలో ఒకప్పటి హీరోయిన్ కస్తూరి ఓ హీరో ఆమెను కోరకున్నట్లు దానికి ఆమె అంగీకారం తెలపకపోవడంతో రెండు మూడు సినిమా చాన్సులు మిస్సయ్యేలా చేసినట్లు బాధపడింది. ఇక బాలీవుడ్ ఎప్పుడూ కాంట్రవర్సీలకు కేంద్ర బింధువుగా నిలుస్తూ.. బాలీవుడ్ చిత్రాల్లో అర్ధనగ్న దృశ్యాల్లో నటిస్తూ బోల్డ్ యాక్ట్రెస్ గా తెచ్చుకుంది రాధికా ఆప్టే.
ఈ అమ్మడు సెక్స్ గురించి చాలా సింపుల్ గా ఓపెన్ గా మాట్లాడుతూ..ఎన్నో సార్లు సంచలనం సృష్టించింది. తెలుగులో బాలయ్య సరసన రెండు సినిమాల్లో నటించింది. కబాలిలో రజనీకాంత్ భార్యగా మెప్పించింది. అయితే, ఈమెకు ఫ్రీ పబ్లిసిటీ అంటే చాలా ఇష్టం. తాజాగా మరోసారి ఇండస్ట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
దక్షిణాది సినీ పరిశ్రమలో హీరోయిన్లను పడక గదికి రమ్మని ఒత్తిడి చేసే సంప్రదాయం ఉందని ఆమె కామెంట్ చేసింది. తనను కూడా కథా చర్చలకు పిలిచిన ఓ నిర్మాత తనను పడక గదికి రావాలంటూ ఒత్తిడి తెచ్చాడని చెప్పింది. అయితే, తాను అంగీకరించలేదని తెలిపింది. ఈ కారణం వల్లే తనకు దక్షిణాదిలో ఎక్కువ అవకాశాలు రాలేదని చెప్పింది.