ఈ మద్య తెలుగు తెరపై కొత్త హీరోయిన్ల జోరు పెరిగిపోయింది.  ముఖ్యంగా బాలీవుడ్, మాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్లు తమ సత్తా చాటుతున్నారు.  రకూల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నా,రెజీనా లతో పాటు ఈ మద్య ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్, సాయి పల్లవి,మెహ్రిన్ లాంటి హీరోయిన్లు కూడా జోరు కొనసాగిస్తున్నారు.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మలు వరుస చాన్సులు దక్కించుకుంటున్నారు. 
Image result for sai pallavi
తెలుగు తెరకి 'ఫిదా' చిత్రంతో పరిచయమైన సాయిపల్లవి, ఆ సినిమాతో యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం నాని జోడీగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' చేస్తోన్న సాయిపల్లవి, శర్వానంద్ సరసన కూడా ఒక సినిమా చేయనుంది.  కోలీవుడ్ లో  రెండు మూడు సినిమాలు ఆమె చేతిలో వున్నాయి.
Image result for sai pallavi fidaa
తాజాగా సాయిపల్లవి ఓ తమిళ హీరోతో ప్రేమాయణం కొనసాగిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు కోడై కూశాయి.  కాకపోతే ఈ వార్తలపై సాయి పల్లవి మాత్రం ఏమీ స్పందించలేదు..కాకపోతే ఓ విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉందట. ఇంతకీ ఆ విషయం ఏంటా అనుకుంటున్నారా.. తాను మళియాళ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అని మీడియా ప్రచారం చేస్తుందని ఈ విషయం తనను ఎంతో బాధిస్తుందని అంటుంది.
Image result for sai pallavi
వాస్తవానికి తాను అచ్చమైన తమిళ అమ్మాయిననీ .. అలాగే ట్రీట్ చేయమని కోరింది.  ఈ అమ్మడు మొదట మళియాళ చిత్రం ‘ప్రేమమ్’లో నటించింది..దీంతో అందరూ మళియాళ ముద్దుగుమ్మ అని ఫిక్స్ అయ్యారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: