ప్రభాస్ అనుష్కల సాన్నిహిత్యం పై ఇప్పటికే అనేకసార్లు అనేక రూమర్స్ రావడం సర్వసాధారణ విషయం. అయితే ఇటువంటి రూమర్స్ వచ్చినప్పుడల్లా ప్రభాస్ అనుష్కలు వీటిని ఖండించడం కూడ పరిపాటిగా మారింది. ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో ప్రభాస్ కోసం అనుష్క తనకు వచ్చిన బాలీవుడ్ మూవీ అవకాశాన్ని వదులుకున్నట్లుగా లేటెస్ట్ గా ప్రచారం జరుగుతోంది. 

ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే ప్రముఖ బాలీవుడ్ సినిమాల నిర్మాత కరణ్ జోహార్ అనుష్కకు ఇచ్చిన అవకాశం పై ఏమాత్రం ఇష్టం కనపరచకుండా వ్యూహాత్మకంగా కరణ్ జోహార్ కు అనుష్క ఊహించని షాక్ ఇచ్చింది అని అంటున్నారు. ఒక ప్రముఖ బాలీవుడ్ హీరోతో కరణ్ జోహార్ త్వరలో మొదలు పెట్టబోయే సినిమాలలో హీరోయిన్ గా నటించమని కరణ్ జోహార్ అనుష్క పై ఒత్తిడి చేయడమే కాకుండా ఆమెకు భారీ పారితోషికం కూడ ఆఫర్ చేసినట్లు టాక్. 

అయితే ఆసినిమా కథలోని తన పాత్ర తనకు నచ్చలేదు అంటూ అనుష్క ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించింది అని అంటున్నారు. ఈ వ్యవహారం వెనుక ప్రభాస్ సలహా సూచనలు ఉన్నాయి అంటూ గాసిప్పులు ఊపు అందుకున్నాయి. వాస్తవానికి కరణ్ జోహార్ తీయబోతున్న ఈసినిమాలో హీరోగా ప్రభాస్ నటించవలసి ఉన్నా పారితోషిక విషయంలో ప్రభాస్ కరణ్ జోహార్ ల మధ్య ఏర్పడ్డ అభిప్రాయ భేదాల వల్ల వీరిద్దరిమధ్య గ్యాప్ పెరగడమే కాకుండా ఈమూవీ ప్రాజెక్ట్ ను ప్రభాస్ వదులుకునేలా చేసింది అని అంటారు. 

ఈ విషయాలను గ్రహించిన అనుష్క ప్రభాస్ ను నొప్పించడం ఇష్టం లేక తనకు వచ్చిన బాలీవుడ్ భారీ ఆఫర్ ను రిజక్ట్ చేసింది అని అంటున్నారు. ఏమైనా ప్రభాస్ అనుష్కల సాన్నిహిత్యం పై ఇలాంటి వార్తలు ఇంకా ఎంతకాలం కొనసాగుతాయో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: