తెలుగు ఇండస్ట్రీలో గత మూడు సంవత్సరాల నుంచి వరుస విజయాలతో దూసుకెళ్లున్న హీరో నేచురల్ స్టార్ నాని తాజాగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘ఎంసీఏ- మిడిల్ క్లాస్ అబ్బాయ్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నాని-సాయి పల్లవి జంటగా నటించిన ‘ఎంసీఏ- మిడిల్ క్లాస్ అబ్బాయ్’ కి సంబంధించి ఈ మూవీ టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఓ టీజర్ రిలీజ్ చేశారు. తాజాగా ఈ మూవీ టైటిల్ సాంగ్ మేం మిడిల్ క్లాస్ అబ్బాయిలం అంటూ దేవీశ్రీ ప్రసాద్ వేసిన దరువును నాని ఫ్యాన్స్ అదరహో అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా హీరో నాని విడుదల చేసిన ఈ సాంగ్స్ 24 గంటల్లోనే మిలియన్ వ్యూస్ క్లబ్లో చేరింది. మొదటి నుంచి లవ్, ఎంట్రటైన్ తో వస్తూ మంచి విజయాలు అందుకుంటున్నారు నాని.
'వీధి చివర ఉంటాదో టీ కొట్టు.. ఆడ మేం తాగే టీ ఏమో వన్ బై టూ' అంటూ సాగుతోన్న ఈ సాంగ్‌లో నిజజీవితంలో మిడిల్ క్లాస్ అబ్బాయిలు ఎలా ఉంటారో పాట రూపంలో వినిపించాడు నాని. వేణు శ్రీరాం డైరెక్షన్లో హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు ‘ఎంసీఏ’ చిత్రాన్ని నిర్మిస్తుండగా క్రిస్మస్ కానుకగా.. డిసెంబర్ 15న మిడిల్ క్లాస్ అబ్బాయిని థియేటర్లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.