తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొళినాళ్లలో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో కరుణాకరణ్ దర్శకత్వంలో ‘తొలిప్రేమ’ లో నటించారు. ఈ సినిమా పవన్ కళ్యాన్ కెరీర్ లో ఓ మైలు రాయిగా నిలిచిపోయింది. ఒక నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న పవన్ కళ్యాన్ ఆ తర్వాత ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలతో టాప్ హీరోగా మారిపోయారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో వరుణ్ తేజ్ ఫిదా సినిమాతో కెరీర్ లో మంచి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు.
ఫిదా ఇచ్చిన సక్సెస్ తో కెరీర్ ను చక్కబెట్టుకోవాలని వరుణ్ చాలా జాగ్రత్తగా కథలను ఎంచుకుంటున్నాడు. వాస్తవానికి ఫిదా సూపర్ హిట్ అయిన తర్వాత వరుణ్ వద్దకు ఎన్నో కథలు వచ్చాయి..తమ సినిమాలో నటించాలని దర్శక, నిర్మాతలు కోరారు. కానీ అవన్నీ రొటీన్ గా ఉండడంతో ఒకే చేయలేదు. మరికొన్నిటిని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాడు.
ప్రస్తుతం వరుణ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటికే తొలిప్రేమ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు ఇప్పటికే తొలిప్రేమ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈరోజు సడన్ గా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అదే టైటిల్ ఇప్పుడు తీసుకుని.. సేమ పవర్ మెయిన్టయిన్ చేస్తున్నట్లున్నారు.
ఇకపోతే ఒక స్టేషెన్ బెంచీపై కూర్చుని.. క్లీన్ షేవ్ తో రిలాక్స్ డ్ గా ఉన్న వరుణ్ తేజ్ ను చూస్తుంటే.. వావ్ అనాల్సిందే. గతంలో బాబాయి కెరీర్ మలుపు తిప్పిన సినిమా టైటిల్ మరి అబ్బాయికి ఎలా కలిసి వస్తుందో చూడాలి.