టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన కామెడీ చిత్రాలు అందించిన ఎస్వీ కృష్ణా రెడ్డి ఆ మద్య వరుసగా ఫ్లాపులు అందుకున్నారు. దీంతో ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా మరోసారి తన అభిమాన హీరోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. గతంలో ఎన్నో కుటుంబ, కామెడీ తరహా చిత్రాలు అందించిన ఎస్వీ కృష్ణా రెడ్డి నందమూరి హీరో బాలకృష్ణతో కలిసి మరోసారి అభిమానుల ముందుకు రాబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘టాప్ హీరో’ చిత్రం మంచి విజయం సాధించింది.
ఈ సినిమాలో దివంగ సౌందర్య హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం బాలకృష్ణ మంచి ఫామ్ లో ఉన్నారు. యువ హీరోలకు ధీటుగా నటిస్తూ తన సత్తా చాటుతున్నారు. ఈ సంవత్సరం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’, ‘పైసా వసూల్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య ప్రస్తుతం ‘జై సింహ’ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఆయన తండ్రి ‘ఎన్టీఆర్ బయోపిక్’ తీస్తారని ఆ మద్య వార్తలు వచ్చాయి.
కానీ ‘జై సింహ’ సినిమా పూర్తి కాగానే..ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలో నటించేందుకు ఒకే చెప్పారట. ఎస్వీ కృష్ణారెడ్డి ఇటీవల బాలకృష్ణకి ఒక ఫాంటసీ కథ చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ కథ బాలకృష్ణకి నచ్చినట్టుగా కూడా చెప్పేసుకున్నారు. జనవరిలో ఈ ప్రాజెక్టును లాంచ్ చేయనున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు.