ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరోల హవా బాగా పెరిగిపోయింది. గత కొంత కాలంగా స్టార్ హీరోల సినిమాలు చాలా తగ్గాయి..సంవత్సరానికి ఒకటీ..ఒక్కోసారి రెండు సంవత్సరాల టైమ్ కూడా తీసుకుంటున్నారు. గత కొంత కాలంగా యంగ్ హీరోలు నాని, శర్వానంద్, రాజ్ తరుణ్, నిఖిల్ లాంటి హీరోలు సంవత్సరానికి రెండు, మూడు సినిమాల్లో నటిస్తూ జోరు కొనసాగిస్తున్నారు.
'అప్పట్లో ఒకడుండేవాడు' .. 'ఉన్నది ఒకటే జిందగీ' .. 'మెంటల్ మదిలో' సినిమాలతో తనకంటూ ఓ క్రేజ్ ఏర్పాటు చేసుకున్న శ్రీవిష్ణు వైవిధ్యభరితమైన కథలకు .. పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన 'మెంటల్ మదిలో' చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మనోడు తదుపరి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు.
ప్రస్తుతం శ్రీ విష్ణు 'నీది నాదీ ఒకే కథ' సినిమా చేస్తున్నాడు. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి, తాజాగా మోషన్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ మోషన్ టీజర్ చూస్తుంటే..కంటెంట్ లో ఏదో కొత్తదనం ఉందనే విషయం అర్ధమవుతుంది. త్వరలో టీజర్ ను .. ఆడియోను కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా శ్రీవిష్ణు కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.