పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం 'అజ్ఞాత‌వాసి'. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌లు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ స్వ‌ర‌క‌ర్త‌. జ‌న‌వ‌రి 10న ఈ సినిమా తెర‌పైకి రానుంది. కాకపోతే  ఈ సినిమాకు సంబంధించి కొన్ని పనులు పూర్తి కాని నేపథ్యంలో ట్రైలర్ ని వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Image result for agnathavasi posters
ఇక ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్.  కానీ వారి ఆశలు నిరాశలు అయ్యాయి.  వాస్తవానికి ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కావాల్సి ఉంది. కొన్ని కార‌ణాల వ‌ల్ల జ‌న‌వ‌రి 5కి 'అజ్ఞాత‌వాసి' ట్రైల‌ర్ విడుద‌ల వాయిదా ప‌డింది. ఈ నెల‌ 29న ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు జ‌రుగనుండ‌గా.. ఈ నెల 31న ప‌వ‌న్ క‌ల్యాణ్‌ పాడిన 'కొడ‌కా కోటేశ్వ‌ర‌రావా.. ' అనే పాట‌ను రిలీజ్ చేయ‌నున్నారు. 
Image result for agnathavasi posters
పవన్ కళ్యాన్ చిత్రం అంటేనే..మాస్ ఓరియెంటెడ్ తో పాటు, సెంటి మెంట్, యాక్షన్ ఉంటుందన్న విషయం తెలిసిందే.  అంతే కాదు  పవన్ కళ్యాన్ గత కొంత కాలంగా తన సినిమాలో సొంత గొంతు వినిపిస్తున్న విషయం తెలిసిందే.  త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్ లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’చిత్రంలో కాటమ రాయుడా అనే పాట ఏ రేంజ్ లో పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసు.  ఈ నేపథ్యంలో తన సెంటిమెంట్ మరోసారి ఫాలో అవుతున్నారు..కనుక సినిమా ట్రైలర్..కాస్త వాయిదా పడింది.   జ‌న‌వ‌రి 10న ఈ సినిమా తెర‌పైకి రానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: