తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు పవన్ కళ్యాన్ 'అజ్ఞాతవాసి' మానియా పట్టుకుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ‘కొడకా కోటేశ్వర్రావు’ అంటూ దుమ్ముదులుపుతున్న విషయం తెలిసిందే. గతంలో జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. గత రెండు సంవత్సరాల నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కి సరైన హిట్స్ లేకపోవడంతో..ఇప్పుడు పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అయితే ఆ మద్య విడుదలైన టీజర్ లో పవన్ నటన, యాక్షన్ చూసి అందరూ ఫిదా అయ్యారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత రాధాకృష్ణ నిర్మించిన చిత్రం అజ్ఞాతవాసి విడుదలకు సిద్ధమవుతోంది. కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్ ఈ సినిమాలో పవన్ సరసన నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఇక సోషల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్ వర్క్ మొదలైంది..ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కొత్త స్టిల్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాన్ ఇరు పక్కల అందాల భామలు కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్ నవ్వూతు కనిపిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.టీ షర్ట్, జీన్స్ ప్యాంటులో పవన్ కొత్త స్టైల్లో కనపడుతున్నాడు.