పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ 25వ సినిమా అజ్ఞాతవాసి బుధవారం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. పవన్‌కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కావడంతో అజ్ఞాతవాసిపై అంచనాలు స్కై ను టచ్ చేసే రేంజ్‌లో ఉన్నాయి. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్‌లోనూ అదిరిపోయే రేంజ్లో వసూళ్లు రాబట్టి పవన్ స్టామినాను, త్రివిక్రమ్ సత్తాను చాటింది.
తెలుగు రాష్ట్రాల్లో అజ్ఞాతవాసి అనేక ప్రాంతాల్లో బాహుబలి రికార్డులను దాటేసింది. కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డులను తుడిచేసింది. అలాగే కోలీవుడ్‌లోనూ అజ్ఞాతవాసి సినిమా హవా నడిచింది. కోలీవుడ్‌లో తొలి రోజు 125 స్క్రీన్లలో రిలీజ్ అయిన అజ్ఞాతవాసి చెన్నై నగరంలో రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి రోజు కేవలం చెన్నై నగరంలో మాత్రమే రూ.24 లక్షల గ్రాస్ రాబట్టుకుంది.
అంతేగాక ఓవర్సీస్లో కూడా ప్రీమియర్స్ రూపంలో 1.5 మిలియన్ డాలర్లను కొల్లగొట్టి బాహుబలి-1 రికార్డును తుడిచిపెట్టేసింది. ఓవరాల్‌గా వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.125 కోట్లకు అమ్ముడయ్యాయి. అన్ని రకాల బిజినెస్‌ల పరంగా చూస్తే అజ్ఞాతవాసికి రూ.160 కోట్ల బిజినెస్ జరిగింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించగా అనిరుధ్ సంగీతాన్ని అందించారు.