టాలీవుడ్ లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రియ శిశ్యుడిగా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాధ్ ‘బద్రి’ సినిమాతో దర్శకుడిగా మారారు. మొదటి సినిమా..మెగా హీరో పవన్ కళ్యాన్ తో సెన్సేషన్ హిట్ కొట్టడంతో..వరుసగా చాన్సులు రావడం మొదలయ్యాయి. తన సినిమాలో మాఫియా నేపథ్యంతో పాటు పోలీస్ హీరోయిజం చూపించే పూరి..ప్రిన్స్ మహేష్ బాబు తో తీసిన ‘పోకిరి’ అప్పట్లో ఎన్నో రికార్డులు కైవసం చేసుకుంది.
ఇక మెగాస్టార్ చిరంజీవిత తన నటవారసుడిగా రాంచరణ్ ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా పూరితోనే కావడం విశేషం. రాంచరణ్-పూరి కాంబినేషన్ లో వచ్చిన ‘చిరుత’ మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత మళ్లీ రాంచరణ్ తో ఏ సినిమా తీయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది.
కె.ఎస్.రామారావు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత ఆయన పూరీతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. కె.ఎస్. రామారావు .. పూరీ 'బుజ్జిగాడు' సినిమా తరువాత చేయనున్న సినిమా ఇది. ఇక పూరీ తాజాగా తన తనయుడు ఆకాశ్ తో 'మెహబూబా' సినిమా చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా రషెష్ చూసిన పూరీ సన్నిహితులు .. చాలా బాగా వచ్చిందని అంటున్నారట. మరి ఇండస్ట్రీలో ఆకాశ్ హీరోగా ఎంత వరకు రాణిస్తారో చూడాలి. ఇప్పటికే పూరి తమ్ముడు సాయిరామ్ శంకర్ కూడా హీరోగా పలు సినిమాల్లో నటించాడు...కానీ ఏదీ పెద్ద హిట్ కాలేదు.