ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హీరోలు ఎంతోమంది ఉన్నారు. ఒకొకరు ఒకొక ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు. వెనుక గాడ్ ఫాదర్ ఉన్నా, టాలెంట్ ను ప్రూవ్ చేసుకొకపోతే అభిమానులు ఎవరూ ఆదరించరు. ఎంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే, అభిమానులను ఆకట్టుకున్న హీరోలే స్టార్ డమ్ ను అందుకుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలకు కొదవే లేదు. అంతేకాకుండా సీనియర్ హీరోలు కూడా యంగ్ హీరోలకు పోటీని ఇస్తున్నారు. దీంతో కొత్తగా వచ్చే హీరోలు యంగ్ హీరోలు , సీనియర్ హీరోలకు పోటీని తట్టుకొని రావాల్సి ఉంటుంది.
ఒకప్పుడు ఏఎన్నార్ ,ఎన్టీఆర్ , కృష్ణ టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోలుగా పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానం ఎవరిది అంటే.. నెంబర్ వన్ అనే దాన్ని ఎలా లెక్కించాలంటే అభిమానులు, విజయాలు, పరాజయాలు లెక్కలోకి తీసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. నందమూరి తారకరామారావుకు అభిమానులు ఎక్కువ ఉండటంతో పాటు, సినిమాలు కూడా వరుస హిట్ అయ్యేవి.
దీంతో ఆయన నెంబర్ వన్ హీరోగా పేరు పొందారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా అంతే.అయితే ప్రస్తుతం చూసుకుంటే బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇంటర్నేషనల్ హీరోగా మారిపోయారు. వరుస హిట్లతో ప్రభాస్ మంచి ఫామ్ మీద ఉన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆ ర్ కూడా వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో సూపర్ ఫామ్ లో కనిపిస్తున్నారు. టెంపర్, నాన్నకు ప్రేమతో,జనతా గ్యారేజ్ , జై లవకుశ సినిమాలు వరుసగా విజయం సాధించాయి. ఇక అల్లు అర్జున్ కు కూడా వరుస విజయాలు ఉన్నాయి.
రామ్ చరణ్ ను తీసుకంటే ఇప్పుడు విజయాలు లేక కాస్ల స్లోగా ఉన్నారు. దీంతో ప్రస్తతం నెంబర్ వన్ స్థానం ఎవరికి దక్కొచ్చు అని లెక్కలు వేసుకుంటే ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ మధ్య పోటీ ఉండవచ్చు. బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇంర్నేషనల్ హీరోగా మారిపోయారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా నాలుగు వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నారు. దీంతో ప్రస్తుతం నెంబర్ వన్ స్థానం ఎన్టీఆర్ కు ఇవ్వవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు.