![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/hrognansi-415x250.jpg)
ప్రపంచంలో ఎంతో పాపులారిటీ పొందిన బిగ్ బాస్ రియాల్టీ షో ఇప్పుడు తెలుగు లో కూడా వచ్చింది. ఇప్పటికే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ పది సీజన్లు పూర్తి చేశారు..సల్లూ భాయ్. ఇక తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా బిగ్ బాస్ షో నడిచింది. తెలుగులో ఎన్టీఆర్, తమిళంలో విశ్వనటుడు కమల్ హాసన్, కన్నడంలో కిచ్చ సుదీప్ లో హోస్ట్ గా ఉన్నారు. అయితే తెలుగు లో పద్నాలుగు మంది తో ఈ ప్రోగ్రామ్ మొదలై..చివరికి శివబాలాజీ బిగ్ బాస్ విన్నర్ అయ్యారు.
![Image result for big boss telugu](https://resize.indiatvnews.com/en/resize/newbucket/715_-/2017/08/bigg-boss-1-700x495-1501680385.jpg)
అప్పట్లో ప్రతిరోజు బిగ్ బాస్ షో నడిచినా..వీక్ ఎండ్ లో వచ్చే ఎన్టీఆర్ కోసమే ప్రేక్షకులు ఎంతో ఆత్రంగా ఎదురు చూసే వారు. ఎన్టీఆర్ విన్యాసాలు, కామెడీ, సీరియస్ ఇలా నవరసాలు పండించే వాడు..దీంతో బిగ్ బాస్ పై మంచి క్రేజ్ పెరిగింది. ‘బిగ్ బాస్’ సీజన్ -1కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో, సీజన్ -2 ను ప్రారంభించాలని నిర్వాహకులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, ఈ సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించట్లేదు.
![Image result for big boss telugu session](http://www.indiaresultz.com/wp-content/uploads/2017/09/Bigg-Boss-Telugu-Season-Title-Winner-Sivabalaji-2.jpg)
కారణం ఎన్టీఆర్ వరుసగా సినిమాలు తీస్తున్నారు..దీంతో షూటింగ్ వచ్చే ఏడాది వరకు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇప్పటికే త్రివిక్రమ్ తో షూటింగ్ ముహూర్తం కూడా మొదలైంది. ఈ సినిమా తర్వాత రాజమౌళితో మల్టీ స్టారర్ సినిమా ఉండబోతుందట. దీంతో, ‘బిగ్ బాస్’ సీజన్ -2లో చేసేందుకు తనకు కుదరదని ఎన్టీఆర్ చెప్పేశారు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ బదులుగా ఎవరిని ఉంచితే బాగుంటుందని నిర్వాహకులు బాగా ఆలోచించిన మీదట ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
![Image result for big boss telugu session](http://data1.ibtimes.co.in/en/full/654409/jr-ntr-bigg-boss-telugu-press-meet.jpg)
టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస విజయాలతో మంచి దూకుడు మీద ఉన్న హీరో నేచురల్ స్టార్ నాని అయితే బాగుంటుందని భావించారట. ప్రస్తుతం అతనితో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. కాగా, ఇటీవల జరిగిన ఐఫా ఉత్సవంలో నటుడు రానాతో కలిసి నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు.