ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  గత సంవత్సరం నుంచి సినీ దిగ్గజాలు కన్నుమూయడంతో..ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది.  నిన్న ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. తెల్లవారుజామున 3గం. సమయంలో స్వగృహంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.గత కొంతకాలంగా గుండు హనుమంతరావు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవలే ఆయన కిడ్నీ ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. 
Related image
ఆర్థికంగానూ గుండు హనుమంతరావు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుండటంతో మెగాస్టార్ చిరంజీవి ఆయన వైద్య ఖర్చుల కోసం రూ.2లక్షలు ఇటీవలే అందజేశారు. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా గుండు హనుమంతరావుకు ఆర్థిక సహాయం అందజేసింది. అయితే ఈ మద్య కొంత మంది తమ స్వార్థం కోసం తల్లిదండ్రులను పట్టించుకోకుండా వృద్దాశ్రమాల్లో వదిలివేస్తున్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆసుపత్రిలో చేర్పించి మమా అనిపిస్తున్నారు. 
Related image
కానీ తన తండ్రి కోసం అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని సైతం పక్కనబెట్టి ఇండియాకు వచ్చి తండ్రి చనిపోయే చివరి నిమిషం వరకు పక్కనే ఉండి సపర్యలు చేశాడు.  ఇంతకీ ఆ గొప్ప తనయుడు ఎవరా అనుకుంటున్నారా..హాస్యనటులు గుండు హనుమంత రావు తనయుడు ఆదిత్య.  తండ్రిని  ఎలాగైనా బతికించుకోవాలని చాలా కష్టాలే పడ్డాడు ఆ తనయుడు. కానీ విధి మాత్రం వెక్కిరించి తన తండ్రిని తీసుకెళ్లింది. అమెరికాలో ఎంఎస్‌ను పూర్తి చేసుకున్న ఆదిత్య ఉద్యోగంలో చేరే సమయంలో తన తండ్రికి ఆరోగ్యం బాలేదని తెలిసింది.

దీంతో వెంటనే అక్కడి నుంచి వచ్చేశాడు. అప్పటికే తన తల్లి, సోదరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతూ బాధపడుతున్న గుండు హనుమంతరావుకు అన్నీ తానై అయ్యాడు. ఇప్పుడు హనుమంతరావు మరణంతో అనాథగా మిగిలిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆదిత్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందరినీ కోల్పోయిన ఆదిత్యకు ఎలాగైనా సాయం చేయాలని పలువురు భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: