ప్రముఖ గాయని చిన్మయి తాజాగా చిన్నారులపై జరుగుతోన్న లైంగిక వేధింపులపై వరుసగా ట్వీట్లు చేశారు. ఆ మద్య సుచిత్ర కూడా చిన్మయిపై లేని పోని ఆరోపణలు చేసిందని ఆవేదన చెంది సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది చిన్మయి. ఈ మద్య తనపై జరిగిన వేధింపుల పట్ల కూడా అందులో ప్రస్తావించారు. తాను ఇటీవల ఓ కార్యక్రమానికి వెళ్లానని అక్కడ ఓ గుర్తుతెలియని వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తూ తనను లైంగికంగా తాకాడని ఆమె అన్నారు.
చిన్నారులు తమ ఉపాధ్యాయులు, అంకుల్స్ చివరకు మహిళల చేతిలో కూడా వేధింపులు ఎదుర్కొన్నవారు ఉన్నారని ఆమె ట్వీట్ చేశారు. ఈ లేక్కలో చాలా మంది మహిళలు, పురుషులు చిన్నతనంలో ఇలాగే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారేనని తెలియడంతో తాను షాకయ్యానని అన్నారు. తాము ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి తమ కుటుంబసభ్యులు, స్నేహితులకు చెప్పడానికి చాలామంది చిన్నారులకు ధైర్యం చాలాదని అన్నారు.
చిత్రమైన విషయం ఏంటంటే..తమ బాల్యంలో జరిగిన లైంగిక దాడి గురించి పురుషులు చెబితే వారిని హేళన చేస్తారని, మరోవైపు మహిళలు చెబితే వాటిని వింటూ ఎంజాయ్ చేస్తారని ఆమె అన్నారు. ఒక వేళ బయట జరిగే లైంగిక వేధింపుల గురించి అమ్మాయిలు ప్రస్తావిస్తే..నువ్వు అసలు బయటకే వెళ్లొద్దని ఆంక్షలు విధిస్తారని..ఈ బాధతోనే కొంత మంది అమ్మాయిలు నోరు విప్పలేరని అన్నారు.
టీనేజ్ లో అయితే కాలేజ్, ఉద్యోగం మానిపిస్తారని అందుకే కొందరు చెప్పబోరని ఆమె అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కొద్దిగా మార్పు వచ్చినట్లు కనపడుతోందని ఆమె తెలిపారు.