భారతీయ చలన చిత్ర రంగంలో అతిలోక సుందరిగా వెలిగిపోయిన నటి శ్రీదేవి. బాలనటిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన శ్రీదేవి బాలనటిగానే ఎన్నో రికార్డులు సృష్టించింది. అతి చిన్న వయసులోనే హీరోయిన్ గా ఎదిగిన శ్రీదేవి బహుబాషా చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో ఎన్నో అద్భతమైన చిత్రాల్లో నటించిన శ్రీదేవి రెండు తరాల హీరోలతో నటించింది. తెలుగు లో మంచి ఫామ్ లో ఉండగానే బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అక్కడే స్టార్ ప్రొడ్యూసర్ బోనీకరపూర్ ని వివాహం చేసుకుంది.
ఈ జంటకు ఇద్దరు ఆడపిల్లు..జాన్వి, ఖుషి కపూర్. ఈ మద్య దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడి హోటల్ లో బాత్ రూమ్ టబ్ లో మునిగి చనిపోయింది. మొదట ఈ కేసులో ఎన్నో అనుమానాలు వచ్చినా..రెండు రోజుల తర్వాత దుబాయ్ పోలీసులు శ్రీదేవి ప్రమాద వశాత్తు టబ్ లో పడి ఊపిరి ఆడక చనిపోయిందని సర్టిఫై చేసి భారత్ కి పంపించారు. ఇక శ్రీదేవి కి అంతిక వీడ్కోలు చెప్పడానికి వేల మంది అభిమానులు తరలి వచ్చారు. తాజాగా శ్రీదేవి మరణంపై మరోసారి వివాదం చెలరేగింది.
ఒకే రోజు ఇద్దరు ప్రముఖులు శ్రీదేవి మృతిపై కామెంట్స్ చేసి కలకలం రేపారు. శ్రీదేవిది సహజ మరణం కాదని.. ఆమెది హత్య అని..ఆమె సహజంగా మరణించలేదని ప్రముఖ జ్యోతిష్య పండితులు, శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం ఆస్థాన పండితులు ములుగు రామలింగేశ్వరస్వామి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే..మహారాష్ట్ర నవనిర్మాణ పార్టీ అధినేత రాజ్ థాక్రే కూడా శ్రీదేవి ఇష్యూను ప్రస్తావించారు.
ఆమె భౌతికకాయంపై త్రివర్ణపతాకం ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. అధికార లాంఛనాలతో ఎందుకు అంత్యక్రియలు నిర్వహించారని మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. మీడియా సైతం ఈ విషయంలో నోరుమెదపకపోవటం విడ్డూరం అన్నారు. శ్రీదేవి గొప్పనటిగా అందరికీ అభిమానం ఉందని.. దేశానికి ఏం చేశారో కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉందన్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి:
raj thackeray
mulugu ramalengeshwar swamy
comments
ap politics
telangana politics
ap political updates
telugu political news
latest news
latest ap updates
political news
indian politics
international news
national news
tollywood news
bollywood news
kollywood news
hollywood news
tollywood
latest film news
latest updates