గత కొన్ని రోజులు నుంచి టాలీవుడ్ లో నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై ప్రకంపణలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు అమ్మాయిలు సినిమాల్లో నటించాలంటే..పక్కలో పడుకోవాల్సిందే..లేదంటే సినిమా చాన్స్ లు రాకుండా చేస్తామని కొంత మంది బడాబాబులు బెదిరింపులకు దిగుతారని..అమ్మాయిలను ఆటబొమ్మలుగా చేస్తున్నారని ఆరోపిస్తుంది. దర్శకులు, నిర్మాతలు, హీరోల ఎవ్వరిని వదలడం లేదు శ్రీరెడ్డి. తన నిరసనలో భాగం ఏకంగా ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన కూడా చేసింది.
శ్రీరెడ్డి లీక్స్.. మొన్నటివరకు వాదోపవాదాలు, చర్చలకే పరిమితమైంది. కానీ ఇప్పుడు అసలైన సీన్ లోకి ఎంటరైంది. తొలి విడతలో భాగంగా ఏకంగా నిర్మాత సురేష్ బాబు కొడుకు, హీరో రానా సొదరుడు దగ్గుబాటి అభిరామ్ స్టిల్స్ విడుదల చేసింది శ్రీరెడ్డి. అతడిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. తాజాగా రచయిత, దర్శకుడు కోనవెంకట్ తో తనకున్న సంబంధాన్ని కూడా శ్రీరెడ్డి బయటపెట్టింది.
తనతో కోన వెంకట్ చేసిన చాటింగ్ కూడా బయటపెట్టిన శ్రీరెడ్డి.. అతను కూడా తనను ముగ్గులోకి దించాలని ప్రయత్నించినట్లు చెప్తోంది. ‘హాయ్ స్వీటీ.. ఏమైంది నీకు.. స్వారీ ఫర్ ది లాస్ట్ నైట్ మెస్సేజ్.. నువ్వు నిజంగానే బరువు తగ్గావు.. నాకు ఫేస్ చూడాలని ఉంది..‘ అంటూ కోనవెంకట్ చేసిన కొంటె చాటింగ్ అందులో ఉంది. తాజాగా ఆమె చేసిన ఆరోపణలపై రచయిత కోన వెంకట్ స్పందించారు. ఓ నటి చేస్తున్న ఆరోపణలతో తాను షాక్‌కు గురయ్యానని కోన వెంకట్ ట్వీట్ చేశారు.
తనతో సహా కొంతమందిపై ఆమె చేస్తున్న ఆరోపణలపై పోలీసులతో దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. చీప్ పబ్లిసిటీ కోసం కొందరు ఇటువంటి చవకబారు ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. తనతో సహా కొంతమందిపై ఆమె చేస్తున్న ఆరోపణలపై పోలీసులతో దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు.
వాస్తవాలను వెలికి తీసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.తెలుగు సినిమాల్లో తెలుగు నటులను తీసుకోవాలనే డిమాండ్‌ను తాను కూడా సమర్థిస్తానని, తన సినిమా ‘గీతాంజలి’లో అందరూ తెలుగువారేనన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్టు చెప్పారు.