నా పేరు సూర్య మీద చాలా అంచనాలు పెట్టుకున్నాడు అల్లు అర్జున్. అయితే ఆ సినిమాకు మొదటి షో నుంచి మిక్స్డ్ టాక్ ను స్వంతం చేసుకున్నది. దీనితో సినిమా హిట్ కాదని తెలిసిపోయింది. అయితే సినిమా కు ముందు పవన్ కళ్యాణ్ మీడియా మీద ఫైర్ అయినా సంగతి తెలిసిందే. దీనితో మీడియా సపోర్ట్ ఈ సినిమా కు దూరం అయ్యిందని చెప్పవచ్చు. ఈ సినిమా కు రావాల్సిన ప్రచారం మీడియా ఇవ్వలేదు. దాంతో సినిమా మీద అంతగా హైప్ రాలేదు.
అయితే నా పేరు సూర్య సినిమా విడుదలకు కాస్త ముందు బన్నీ తనంతట తాను అటు రామ్ చరణ్ కు, ఇటు పవన్ కు దగ్గరవ్వాలనే చూసారు. అలాంటి టైమ్ లో ఫిల్మ్ చాంబర్ దగ్గర పవన్ హల్ చల్ చేయడం అన్నది కలిసి వచ్చింది. బన్నీ వెళ్లి కలిసాడు. కౌగిలించుకున్నారు. ఆ తరువాత బన్నీ కూడా పవర్ స్టార్ అని సభల్లో చెప్పడం ప్రారంభించాడు. అయితే ఇది బన్నీకి ప్లస్ అవుతుందీ అనుకుంటే మైనస్ గా మారింది. నిజానికి పవన్ దుందుడుగా వ్యవహరించినట్లు కనిపిస్తుంది.
అలా ఆలోచించి వుంటే అంత హడావుడిగా చాంబర్ దగ్గరకు వెళ్లి నానా హల్ చల్ చేసి, మీడియాతో కంపు కంపు చేయరు. ఇప్పుడేమయింది. పవన్ చేసింది టోటల్ గా మెగాఫ్యామిలీకి చుట్టుకుంది. పవన్ కోసం అరవింద్, నాగబాబు, ఇలా అందరూ ముందుకు అడుగువేసారు. దాంతో మీడియా మొత్తానికి మెగా ఫ్యామిలీ టార్గెట్ అయింది