కొంత కాలంగా టాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌పై పోరాడుతూ సంచలనంగా వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి... సినీ ప్రముఖులపై విమర్శలు చేస్తూ వారికి సంబంధించిన ఫోటోలు లీక్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమాల్లో నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోల పక్కనే పడుకోనిదే పాత్రలు రావంటూ.. ఇటీవలే బట్టలిప్పేసి కలకలం సృష్టించిన శ్రీరెడ్డి ఇప్పుడు సామాజిక సేవకు దిగి కొత్త అవతారమెత్తింది. అయితే శ్రీరెడ్డి పోరాటం కీలక స్థాయి చేరే సమయానికి జనసేన అధ్యక్షుడిని అనరాని మాటలు అనడంతో ఓ వైపు ఇండస్ట్రీ...మరోవైపు జనాల ఆగ్రహానికి గురైంది. దాంతో కాస్టింగ్ కౌచ్ పోరాటం బ్రేక్ పడినట్లయ్యింది.
Image result for sri reddy
అప్పటి నుంచి శ్రీరెడ్డి ఇంటికే పరిమితం అయ్యింది.  అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్లో దర్శనమిస్తుంది.  అయితే ఇంట్లో ఉండే..సోషల్ మాద్యమాల ద్వారా స్పందిస్తూ వస్తుంది.  తాజాగా శ్రీరెడ్డి క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతోందంటూ వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు తన కొత్త అవతారాన్ని చూస్తుంటే త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.   
Related image
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం, గురిజేపల్లి సమీపంలో కొందరు తమకు ఉపాధి పనులు కల్పించడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. అటుగా వెళ్తున్న శ్రీరెడ్డి కారు దిగి, తలకు తలపాగా చుట్టుకొని స్థానికులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అయితే ఆమెను చూసిన స్థానికులు అవాక్కయ్యారు. శ్రీరెడ్డి ఏంటీ.. ఇలా త‌మ‌కు మ‌ద్దతు ఇవ్వడం ఏంటని విస్తుపోయారు. కాసేపు అక్కడ హ‌డావుడి చేసిన ఆమె, స్థానికులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం త‌న కారులో అక్కడ నుండి వెళ్లిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: