దేశభక్తి ముమ్మరంగా ప్రస్పుట మవుతున్న రోజులవి. త్యాగధనుల కాలమది. మనదేశాన్ని కాలనాగుల్లా చుట్టేసిన పాకిస్తాన్ దాని ప్రియనేస్తం చైనా! భారత్, పాక్ మధ్య 1965లో రెండోసారి యుద్ధం మొదలైంది వరస యుద్ధాలతో మనదేశం ఆర్థికంగా చాలా దెబ్బతిన్నది. అదే సమయంలో యుద్ధం లో భారత్ దగ్గర మందు గుండు సామగ్రి అయిపోయింది. దీంతో నాటి మన ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి ప్రజలను విరివిగా విరాళాలు ఇచ్చి దేశానికి సహాయపడాలని దేశ ప్రజలను అభ్యర్థించారు. 
savitri with Lal Bahadur Shastri కోసం చిత్ర ఫలితం

అదే సంవత్సరం సెప్టంబర్‌లో ఒక రోజు ప్రధాని చాంబర్‌ లోకి గుమస్తా వచ్చి "మీ కోసం ఒక దక్షిణాది నటి వచ్చారు వేచిఉన్నారు’ అని సమాచారం శాస్త్రి గారికి అందించారు. ఎవరా? అని ఆలోచిస్తూనే "సరే లోపలికి పంపండి" అని ఆదేశించారు నాటి ప్రజా ప్రధాని. కొంతసేపటి తర్వాత 28ఏళ్ల వయసున్న ఒక యువతి ఒంటి నిండా నగలతో మిరుమిట్లుగొలుపుతూ ప్రధాని వద్దకు వచ్చి, సగౌరవంగా ప్రధానికి నమస్కారం చేశారు. శాస్త్రి గారికి తనను తానెవరో పరిచయం చేసుకున్నారు. శాస్త్రి గారు కూడా అభినందన పూర్వకంగా నవ్వారు.
savitri with Lal Bahadur Shastri కోసం చిత్ర ఫలితం
ఆమె తాను వచ్చిన పని ఏమిటో చెబుతూ, తాను దేహం నిండా ధరించిన ఆభరణాలన్నింటినీ ఒక్కోటి తీసి ప్రధాని టేబుల్ మీద పెట్టారు. ఇవన్నీ "ప్రధాని నిధికి నా వంతు చిన్న సహాయం" అని నవ్వుతూ బదులిచ్చారు. తాళిబొట్టు మాత్రం ఉంచేసుకొని ఒంటిపై నగలన్నీ విరాళంగా ఇచ్చిన ఆమె వంక చూస్తూ, ప్రధాని ఆశ్చర్యపోయి అలాగే ఉండిపోయారు. 
savitri patriotism goes viral, mahanati gave all ornaments for pm fund
కాసేపటి తర్వాత తేరుకొని ఆనందం నిండిన కళ్లతో, "భేటీ నువ్వు మహనీయురాలివమ్మా! నీ దేశభక్తికి నా హృదయపూర్వక అభినందనలు" అంటూ శాస్త్రి గారు ఆమెను ప్రశంసించారు. ఆమె తో కరచాలనం చేసి, సగౌరవంగా గుమ్మం వరకు వెళ్లి సాగనంపారు. 


ఇంతకీ ఆమె ఎవరో చెప్పలేదు కదూ! ఆమె మన మహానటి, తెలుగు వారి ఆడపడచు మహానటి సావిత్రి గారు. ఆమె చేసిన అనేక దానాల్లో బయటకు తెలిసిన దానం ఇదొకటి. ఆమె దేశభక్తికి, దాతృత్వానికి ఇదొక ఉదాహరణ మాత్రమే! 
savitri with Lalbahadur Sastry కోసం చిత్ర ఫలితం
అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "మహానటి" నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సావిత్రిగా కీర్తి సురేష్ అద్భుతమే చేసింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకెళ్తోంది. సావిత్రి జీవితానికి సంబంధించి తెలియని విషయాల పరంపర ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ మహానటి కి సంబంధించిన అనుభవాలు అభిమానులు తెరపైనేకాకుండా అనేక విషయాలను తమ మనోపలకాలపై కూదా వీక్షిన్ చారు. 
సంబంధిత చిత్రం

మహానటి సినిమా నేపథ్యంలో సావిత్రి గురించి తాము విన్న, చదివిన అనేక ఘటనలను అభిమానులు పంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆమెను ప్రశంసిస్తూ పలు పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో మహనటి సావిత్రి దేశభక్తి, దాతృత్వానికి అద్దంపట్టే అద్భుతమైన ఈ సంఘటనను ఒక  ఓ నెటిజన్ పంచుకున్నాడు. ఫోటోతో సహా చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

savitri with Lalbahadur Sastry కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: