![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/overseas collections flood for mahanati -415x250.jpg)
తెలుగు చిత్రసీమ చరిత్రను ఒక సాధారణ బడ్జెట్ సినిమా అద్భుత నేపధ్యమున్న కథానాయకి కథతో బిగ్ బడ్జెట్ సినిమాని తలపించేటట్లు, మిరుమిట్లు గొలిపే విజయాన్ని సాధించింది. తెలుగు సినిమా తొలి "జీవిత కథా చిత్రం" అంటే "ఫస్ట్ బయోపిక్ మూవీ - మహానటి" చారిత్రాత్మక విజయం సాధించింది.
![mahanaTi collections à°à±à°¸à° à°à°¿à°¤à±à°° ఫలితà°](http://www.tollywood.net/wp-content/uploads/2018/05/Mahanati-6-days-AP-TS-Box-Office-Collections.jpg)
సృజనాత్మక నూతన దర్శకుడు నాగ్ అశ్విన్ తన రెండవ ప్రయత్నంగా "అలనాటి మేటి మహానటి సావిత్రి" జీవిత కథ ఆధారంగా కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో నటించగా తెరకెక్కించిన ఈమూవీ విడుదలైన తొలిరోజునుండి కలెక్షన్ల సునామీ సృష్స్టిస్తూ వది వదిగా అడుగులువేసి ఇప్పుడు పరుగులు తీస్తోంది. "రంగస్థలం, భరత్ అనే నేను" లాంటి అతి పెద్ద బడ్జెట్ తో నిర్మించబడి విజయవంతమైన చిత్రాల వీరవిహారం నడుమ చిన్నగా తన ప్రయాణం ప్రారంభించి గంగోత్రిలా మారి "మహానటి" టాప్ కలెక్షన్లు సాధించిన సినిమాల సరసిన నిలిచింది.
![keerthy suresh mahanati entering 2 millions club in overseas](https://telugu.samayam.com/photo/msid-64233198/width-400/resizemode-4/Telugu-image.jpg)
మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన ఆదరణ పొందింది. ఇక విదేశాల్లో తిరుగులేని కలెక్షన్లతో తన సత్తా చాటుతోంది. 150లొకేషన్ల లో భారీగా విడుదలైన ఈ మూవీ 5రోజుల్లోనే "మిలియన్ల డాలర్ల క్లబ్" లో చేరి తిరుగులేని రికార్డులు నమోదు చేయగా, తొలి "9 రోజుల్లో రెండు మిలియన్ల డాలర్ల క్లబ్" లో చేరినట్టు ప్రముఖ మూవీ అనలిస్ట్ "రమేష్ బాలా" తన ట్వీట్ ద్వారా తెలియజేశారు.ప్రస్తుతం ఈ మూవీ 120లొకేషన్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది.
![mahanaTi collections à°à±à°¸à° à°à°¿à°¤à±à°° ఫలితà°](https://i.ytimg.com/vi/5r4P0_Lx67w/maxresdefault.jpg)
ఇక మొత్తం కలెక్షన్స్ విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా తొలి తొమ్మిది రోజులకు గానూ ₹41.80 కోట్ల గ్రాస్, ₹23.30 కోట్లు షేర్ సాధించినట్టు తెలుస్తుంది. ఇక ఏపీ, నైజాం ఏరియాల్లో ₹21.90 కోట్ల గ్రాస్, ₹12.80 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది. వీటిపై ఇంకా అధికారక సమాచారం రావాల్సిఉంది. ఇక ఓవర్సీస్లో ₹ 2 మిలియన్ల క్లబ్ లో చేరిన తెలుగు చిత్రాల వరుస చూస్తే:
1. బాహుబలి 2
2. బాహుబలి
3. రంగస్థలం
4. భరత్ అనే నేను
5. శ్రీమంతుడు
6. అ.. ఆ
7. ఖైదీ నెం. 150
8. ఫిదా
9. అజ్ఞాతవాసి
10. నాన్నకు ప్రేమతో
11. మహానటి
![mahanaTi collections à°à±à°¸à° à°à°¿à°¤à±à°° ఫలితà°](https://www.telugu360.com/wp-content/uploads/2018/04/mahanati.jpg)
నటీ నటులు కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, మోహన్‌బాబు, రాజేంద్ర ప్రసాద్, షాలిని పాండే, ప్రకాష్ రాజ్, దర్శకులు క్రిష్, అవసరాల శ్రీనివాస్, తదితరులు నటించిన ‘మహానటి’ సినిమా విడుదలై 10 రోజులు పూర్తి చేసిని రికార్డ్ కలెక్షన్ల సాధిస్తున్న తరుణంలో పలువురు శుభాకాంక్షల్ని తెలియ జేస్తున్నారు. ఈ సందర్భంగా ఇండియా హెరాల్ద్ గ్రూప్ తన శుభాకాంక్షలు తెలుపుతుంది.