‘మహానటి’ సినిమా తర్వాత సావిత్రి, జెమినీ గణేషన్ పై ఈ మద్య రక రకాల కథనాలు వస్తున్నాయి.  అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ సినిమా ఘన విజయం సాధించి కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి.  అయితే సావిత్రి జీవితక కథలో ముఖ్య భూమిక పోషించారు ఆమె భర్త జెమినీ గణేషన్.  విమ‌ర్శ‌కులు కూడా ఈ మూవీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.
Image result for gemini ganesan wifes\
యూఎస్‌లో ఈ సినిమా 2 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ళు రాబట్టి స్టార్ హీరోల సినిమాల‌కి ఏ మాత్రం త‌క్కువ కాద‌ని నిరూపించింది.  అప్పటి వరకు నటి సావిత్రి జీవితంపై ఎన్నో అనుమానాలు ఉండేవి..కానీ మ‌హాన‌టి చిత్రంలో సావిత్రి జీవిత నేప‌థ్యం గురించి క్లుప్తంగా చూపించాడు నాగ్ అశ్విన్‌. సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో ఆమె గురించి, సావిత్రి భ‌ర్త జెమినీ గ‌ణేష‌న్ గురించి పూర్తి వివ‌రాలు తెలుసుకునేందుకు నెటిజ‌న్స్ చాలా ఉత్సుక‌త చూపిస్తున్నారు.
Image result for gemini ganesan wifes\
జెమినీ గ‌ణేష‌న్ మూడు వివాహాలు చేసుకోగా ఆయ‌న‌కి అల‌మేలు, పుష్ప‌వ‌ల్లి, సావిత్రి అనే ముగ్గురు భార్య‌లున్నారు. అల‌మేలుకి డాక్ట‌ర్ జ‌యా శ్రీధ‌ర్‌, డాక్ట‌ర్ రేవ‌తి, డాక్ట‌ర్ క‌మ‌లా సెల్వారాజ్, నారాయ‌ణి అనే న‌లుగురు కూతుళ్ళు ఉన్నారు. 

ఇక పుష్ప‌వ‌ల్లికి సీనియ‌ర్ హీరోయిన్ రేఖ‌, రాధ అనే ఇద్ద‌రు కూతుళ్ళు ఉన్నారు. సావిత్రికి విజ‌య్ చాముండేశ్వ‌రి అనే కూతురితో పాటు స‌తీష్ అనే కొడుకు కూడా ఉన్నాడు. మొత్తంగా జెమినీ గ‌ణేష‌న్‌కి ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తాజాగా   సోష‌ల్ మీడియాలో జెమినీ గ‌ణేష‌న్ కూతుళ్లంద‌రు క‌లిసి దిగిన గ్రూప్ ఫోటో చక్క‌ర్లు కొడుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: