తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక సునామీని సృష్టించిన ‘అర్జున్ రెడ్డి’ తో ఒకేసారి వెలుగులోకి వచ్చిన శాలినీ పాండే ఇప్పటి వరకు నటించినవి కేవలం రెండే సినిమాలు అయినా ఆరెండు సినిమాలతో ఆమెకు ఏర్పడ్డ క్రేజ్ మాటలకు అందనిది. ఈమధ్య ఈమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జున్ రెడ్డిలో తాను విజయ్ దేవర కొండతో రోమాంటికి సీన్స్ నటిస్తున్నప్పుడు పడ్డ నరకయాతనను బయట పెట్టింది. 
సంబంధిత చిత్రం
గతంలో తాను కాలేజీలో చదువుతున్నప్పుడు రెండు సార్లు ప్రేమలో పడి విఫలం అయిన విషయాలను అందరికీ షాక్ ఇస్తూ బయటపెట్టింది. లవ్ లో ఫెయిల్ అయిన తాను అర్జున్ రెడ్డి మూవీలో విజయ్ దేవర కొండతో రొమాంటిక్ సీన్స్ లో నటించవలసి వచ్చినప్పుడు తాను నరకయాతన పడ్డానని ఆ టార్చర్ తాను ఇప్పటికీ మరిచిపోలేను అంటూ ‘అర్జున్ రెడ్డి’ అనుభవాలను గుర్తుకు చేసుకుంది. 
ACTRESS SHALINI PANDEY LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇంజనీరింగ్ చదువుకున్న తాను సినిమాల పై మోజుతో ఉద్యోగాన్ని మానివేసినప్పుడు బిచ్చ మెత్తుకుని తింటావు అని తన తండ్రి తిట్టిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ తాను సినిమా నటిగా పేరు తెచ్చుకున్నా తన తండ్రిలో అసంతృప్తి పోలేదు అని అంటోంది ఈ క్రేజీ హీరోయిన్. తన తండ్రి పై కోపంతో సినిమాలలో అవకాశాల కోసం ముంబాయ్ వచ్చిన తనకు ఎదురైన చేదు అనుభవాలు గుర్తుకు చేసుకుంటూ ఒకానొక సందర్భంలో ఎక్కడా ఇల్లు దొరకక అంతా అబ్బాయిలే ఉన్న రూమ్ లో తాను రూమ్ షేర్ చేసుకోవలసిన విచిత్ర పరిస్తుతులను వివరిస్తూ తాను పడ్డ నరకాన్ని వివరించింది శాలిని. 
ACTRESS SHALINI PANDEY LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
మంచినటిగా పేరు తెచ్చుకున్న శాలినీ పాండే మంచి గాయని కూడ బెంగుళూరుకు చెందిన ‘లగోరీ’ బ్యాండ్ తో ఈమె ‘నా ప్రాణమే’ అన్న పాటను వీడియో సాంగ్ గా విడుదల చేసింది. ఈ పాటకు యూట్యూబ్ లో మంచి స్పందన వస్తోంది. పుస్తకాలను బాగా చదివే అలవాటు ఉన్న నాటకాలు సినిమాలు అంటే విపరీతమైన క్రేజ్ ఉన్నా ఈమె ఉత్సాహానికి తగ్గ స్థాయిలో శాలినీకి సరైన అవకాశాలు ఇంకా రావడం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: