తెలుగు ఇండస్ట్రీలో ఈ సంవత్సరం ప్రిన్స్ మహేష్ బాబుకి బాగా కలిసి వచ్చిందనే చెప్పొచ్చు.  అయితే మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘స్పైడర్’ దారుణమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది..దాంతో విపరీతమైన టెన్షన్ లో ఉన్న మహేష్ బాబు కి  దర్శకుడు కొరటాల శివ తో మరోసారి అదృష్టం కలిసి వచ్చింది.  గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.  వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘భరత్ అనే నేను’ మరో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. 
Image result for mahesh babu
దాంతో మహేష్ బాబు తన తదుపరి చిత్రం కూడా అదే రేంజ్ లో హిట్ కావాలని చూస్తున్నారు.  ఈ మద్య స్టార్ హీరోలు తమ పాత్రలపై ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే.  లుక్ పరంగా కూడా చాలా డిఫరెంట్ గా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు.  ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ తమ పాత్రలకు తగ్గట్టు వేషధారణలో కూడా కొత్తదనం చూపిస్తున్నారు.  ఈ నేపథ్యంలో మహేష్ బాబు తన తదుపరి చిత్రంలో కొత్త లుక్ లో కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. 
Image result for koratala mahesh babu
గుబురు గడ్డం, మీసాలు.. పొడవు జట్టులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలా ఉంటాడో ఓ సారి ఊహించుకోండి. సరిగ్గా క్లిక్ కావడం లేదా? ఇదిగో మహేష్ సతీమణి నమ్రతా కూడా ఇలాగే ఊరిస్తున్నారు.
Image result for mahesh babu wife
ఈ సందర్భంగా నమ్రతా శిరోద్కర్.. కుమార్తె సితారతో ఆడుకుంటున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్లో పోస్టు చేశారు. అయితే, ఇందులో మహేష్‌ బాబును పూర్తిగా చూపించకుండా వెనక్కి తిరిగి ఉన్న ఫొటోను పెట్టారు. ఒత్తైన జుట్టు, మాసిన గడ్డంతో కనీ కనిపించకుండా ఉంది. దీంతో, అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. మహేష్ ఈ లుక్‌లో సుపర్బ్‌గా ఉంటాడంటూ పొగిడేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: