తెలుగు ఇండస్ట్రీలో మాస్ మహరాజ గా పేరు తెచ్చుకున్న రవితేజ గత కొంత కాలం వరకు తన కుటుంబం విషయాలు ఏవీ బయటకు రానివ్వకుండా జాగ్రత్త తీసుకున్నారు.  అయితే గత సంవత్సరం రిలీజ్ అయిన ‘రాజా ది గ్రేట్’ ఆయన తనయుడు మహాధన్ ని ఇంట్రడ్యూస్ చేశాడు.  రవితేజ చిన్న నాటి పాత్రలో మహాధన్ దుమ్ముదులిపాడు.
Image result for AMARA AJBAR ANTONY RAVITEJA
గ‌తేడాది `రాజా ది గ్రేట్‌` సినిమాతో ఘ‌న‌విజ‌యాన్ని అందుకున్న మాస్ మ‌హారాజ్ ర‌వితేజ ఆ త‌ర్వాత `ట‌చ్ చేసి చూడు`, `నేల టికెట్‌` రూపంలో రెండు వ‌రుస ప‌రాజ‌యాల‌ను అందుకున్నాడు.  ప్రస్తుతం  శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రం మాస్ ఎలిమెంట్స్ తో మరోసారి ‘దుబాయ్ శీను’ మార్క్ ను మించి పోతుందని దర్శకుడు, హీరో తెలుపుతున్నారు.
Image result for RAVI TEJA SON
ఈ ఏడాది ద‌స‌రాకు ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. కాగా, ర‌వితేజ ప్ర‌స్తుతం త‌న కుటుంబంతో క‌లిసి థాయ్‌లాండ్ పర్య‌ట‌న‌కు వెళ్లాడు. కూతురు, కొడుకుతో క‌లిసి ఈ ట్రిప్‌ను స‌ర‌దాగా ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్ల‌ల‌తో ర‌వితేజ స‌ర‌దాగా తీయించుకున్న ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: