తెలుగు, తమిళ భాషల్లో ‘గజిని’సినిమాతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు సూర్య.   ఆ తర్వాత వరుసగా తెలుగులో తన సినిమాలు రిలీజ్ చేస్తూ తెలుగు హీరోలతో మంచి సాన్నిహిత్యం పెంచుకున్నాడు.  హీరో సూర్యకు తమిళంలోనే కాదు తెలుగు లోకూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.  అయితే తెలుగుతో తన అభిమానుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా చేశారు హీరో సూర్య. 
Image result for hero surya
ఆ మద్య విశాఖలో హుదూత్ తుఫాన్ వచ్చినపుడు తన వంతుగా నలభై లక్షల సహాయం అందించాడు.  ఇక తెలుగు లో సింగం సీరీస్ తో వచ్చిన సినిమాలు మంచి హిట్ కావడమే కాదు కలెక్షన్లు కూడా కొల్లగొట్టాయి.  తాజాగా సూర్య, సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `ఎన్‌జికె`. రీసెంట్‌గా చేగువేరా లుక్‌లో సూర్య పోస్టర్ విడుద‌లై సెన్సేష‌న‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. 
Image result for hero surya
ఈ సినిమాలో సూర్య రాజకీయ నాయకుడిగా నటించబోతున్నాడట.  ఈ మద్య సినిమాలు ఎక్కువగా రాజకీయ నేపథ్యంలో వస్తున్న విషయం తెలిసిందే.  తేజ దర్శకత్వంలో రానా నటించిన నేను రాజు నేనే మంత్రి రాజకీయ నేపథ్యంలో వచ్చిన సినిమానే..అది మంచి విజయం సాధించింది.  ఇక కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘భరత్ అనే నేను’ కూడా రాజకీయ నేపథ్యంలో వచ్చిన సినిమా అయినా..మహేష్ బాబు నటనకు అందరూ ఫిదా అయ్యారు. 
NGK surya new telugu movie
అంతే కాదు మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది.  ఈ సినిమాకు సంబంధించిన మేజ‌ర్ పార్ట్ షూటింగ్ కూడా పూర్త‌య్యింది. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సాయిప‌ల్ల‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. యువన్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత సూర్య కె.వి.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో, సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలు చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం నిర్మాత‌గా త‌మ్ముడు కార్తి న‌టించిన చిన‌బాబు చిత్రాన్ని విడుద‌ల చేయ‌డంలో బిజీగా ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: