ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లు ఒక్క చిత్రంతో అదృష్టాన్ని తమ సొంతం చేసుకుంటున్నారు. గతంలో హీరోయిన్ గా మంచి పోజీషన్లోకి రావాలంటే కనీసం ఓ పది చిత్రాల్లో నటించాల్సి వచ్చేది..అందులో హిట్..ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి నానా తంటాలు పడే వారు. కానీ ఈ మద్య కొంత మంది హీరోయిన్లు మాత్రం ఒక్క చిత్రంతో స్టార్ హోదా సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేను శైలజా, నేను లోకల్ చిత్రాలతో తెగులు మంచి క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ‘మహానటి’తో అగ్ర కథానాయికల లీస్టు లో చేరిపోయింది.
ఇక ఫిదా చిత్రంతో మాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి వరుసగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో చాన్స్ లు దక్కించుకుంది. అయితే తెలుగు లో ‘ముకుంద’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే తర్వాత వచ్చిన ఒక లైలా కోసం చిత్రాలతో ఏమాత్రం పేరు తెచ్చుకోలేక పోయింది. అప్పటి వరకు ఈ అమ్మడికి సాంప్రదాయంగా కనిపిస్తూ వచ్చింది. దాంతో పెద్దగా ఛాన్సులు రాలేదు.
కానీ అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంలో బికినీతో కుర్రకారుకి పిచ్చిలేపింది. అప్పటి వరకు దాచుకున్న ఈ అమ్మడి అందాలు ఒక్కసారే చూపించడంతో కుర్రాళ్ల మతులు పోయాయి. దాంతో దర్శక, నిర్మాతలు సైతం ఈ అమ్మడి అందానికి ఫిదా అయ్యారు. అక్కడి నుంచి పూజా దశ మారింది. వరసగా పెద్ద సినిమాల్లో ఆఫర్లు రావడం మొదలు పెట్టాయి.
రంగస్థలంలో స్పెషల్ సాంగ్ లో కూడా మెరుపులు మెరిపించిన పూజ... ఎన్టీఆర్ తో అరవింద సమేత చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు మహేష్ బాబు 25 వ సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది. ఇవి చాలదన్నట్టు ఇటీవలే ఫిల్మ్ ఫేర్ లో లైట్ కలర్ వైట్ షర్ట్ కనువిందు చేసింది. ఈ గ్లామర్ మెరుపు ద్వార పూజా మరిన్ని అవకాశాలు దక్కించుకున్న ఆశ్చర్యపోనక్కరలేదు.