శ్రీరెడ్డి తమిళ్ లీక్స్ అంటూ తమిళ ఇండస్ట్రీ ప్రముఖల మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ వారి గుండెల్లో దడ పుట్టిస్తుంది. అయితే తాజాగా ఈమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. కారులోనే అన్నీ చేస్తారని, కారునే పడక గదిగా వాడుకుంటారని చీకటి కోణాలు ను బయట పెట్టింది. తాజాగా శ్రీరెడ్డి చిక్కులు నడిగర్ సంఘం వరకు చేరాయి. నడిగర్ సంఘం కోశాధికారిగా పనిచేస్తున్న హీరో కార్తీ.. ఆధారాలు లేకుండా శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలేంటని ప్రశ్నించారు. ఆమెపై ఫిర్యాదు చేస్తే.. అప్పుడు విచారణ జరుపుతామన్నారు.
దీనిపై శ్రీరెడ్డి స్పందిస్తూ.. తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే తానేంటో చూపించాల్సి వస్తుంది. లాజిక్కులు మాట్లాడొద్దు కార్తీ సార్ అంటూ కౌంటర్ఇచ్చింది. నడిగర్ సంఘం ఉన్నది సమస్యలు తీర్చడానికి.. ఉచిత సలహాలు ఇవ్వడానికి కాదు అంటూ శ్రీరెడ్డి కార్తీ పై ఫైర్ అయింది. మరోవైపు దర్శకనిర్మాతలు అవకాశాల పేరిట హీరోయిన్లను తెగ వాడేసుకుంటున్నారని శ్రీరెడ్డి ఆరోపించింది.
నటులు, నిర్మాతలు హీరోయిన్లను లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తున్నారని.. అలా కారులోనే పనికానిచ్చేస్తున్నారని.. కారునే పడకగదిగా మార్చేస్తున్నారని, హీరోయిన్లతో ఉల్లాసంగా వుంటున్నారని విమర్శలు గుప్పించింది. కొన్ని సందర్భాల్లో ఓ పాట కోసమంటూ విదేశాల్లో షూటింగ్కు తీసుకెళ్ళి.. హీరోయిన్లపై తమ వాంఛను తీర్చుకుంటున్నారని శ్రీరెడ్డి చెప్పింది. దర్శకనిర్మాతలే కాకుండా మేనేజర్, కెమెరామేన్, మేకప్ మ్యాన్లను కూడా హీరోయిన్లు కాంప్రమైజ్ చేయాలని తెలిపింది.