‘నాపేరు సూర్య’ ఫెయిల్యూర్ తో అల్లు అర్జున్ కు ఏర్పడ్డ అయోమయం ఓపెన్ సీక్రెట్. దీనితో ఏ దర్శకుడుతో తన తదుపరి సినిమా చేయాలి ఎలాంటి కథను ఎంచుకోవాలి అన్న విషయంలో బన్నీకే క్లారిటీ లేకుండా పోయింది. దీనితో తన కెరియర్ లో ఎప్పుడు లేనివిధంగా చాల లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు బన్నీ.
ఇలాంటి పరిస్థుతులలో క్రియేటివ్ దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పిన కథ నచ్చినా ఆకథ విషయంలో సాహసం చేయలేక తిరిగి తన ఆలోచనలు మొదలు పెట్టాడు అల్లు అర్జున్. ఇలాంటి పరిస్థుతులలో ‘సభకు నమస్కారం’ పై అల్లు అర్జున్ మనసు పడినట్లు వార్తలు వస్తున్నాయి.
దిల్ రాజ్ ఇప్పటికే రిజిస్టర్ చేసిన ఈ ‘సభకు నమస్కారం’ టైటిల్ కు సంబంధించిన కథ ఒక పొలిటికల్ సెటైర్ మూవీ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు అల్లు అర్జున్ పొలిటికల్ సెటైర్ మూవీలలో నటించని నేపధ్యంలో ఈ డిఫరెంట్ జోనర్ తనకు కలిసి వస్తుందని బన్నీ ఆలోచన అని అంటున్నారు. వాస్తవానికి ఈసినిమా కథకు సంబంధించిన లైన్ మాత్రమే దిల్ రాజ్ కు ఒక ప్రముఖ రచయిత చెప్పినట్లు తెలుస్తోంది.
ఈస్టోరీ లైన్ స్టైలిష్ స్టార్ కు బాగా నచ్చడంతో ఈకథను డెవలప్ చేయించమని దిల్ రాజ్ కు సూచించినట్లు సమాచారం. వాస్తవానికి ఈ కథను దిల్ రాజ్ నానీతో వచ్చే ఏడాది తీయాలని అనుకున్నాడు. అయితే వచ్చే సంవత్సరం ఎన్నికల సంవత్సరం కాబట్టి ఒక పొలిటికల్ సెటైర్లతో కూడిన మూవీ తనకు కలిసి వస్తుందని బన్నీ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు అని అంటున్నారు..