భారత దేశంలో కేరళా ఎంతో సుందర రాష్ట్రం..కానీ ఈ మద్య కురిసిన భారీ వర్షాలకు కేరళ మొత్తం అతలాకుతలం అయ్యింది. దాదాపు నాలుగు వందల మంది మృత్యువాత పడ్డారు..వేల సంఖ్యలో గాయపడ్డారు. ఎంతో మంది నిరాశ్రుయులయ్యారు. కేరళా బాధితులను ఆదుకునేందుకు సినీ ఇండస్ట్రీల మొత్తం కదిలింది. రాజకీయ నాయకులు, పారిశ్రామి వేత్తలు తమకు తగ్గ సహాయం అందించారు.
ఇదిలా ఉంటే..ఎంతోమంది ప్రముఖులు కేరళకు భారీగా విరాళాలు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో అభిమానులు పోస్ట్‌లు చేశారు. అయితే వీటిలో కొన్ని నిజం కాగా.. మరికొన్ని ఎవరో సృష్టించినవి. తాజాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఏకంగా రూ. 12 కోట్లు విరాళం ప్రకటించాడనే వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది.
ఈ విషయాన్ని బాలీవుడ్ నటుడు జావెద్ జాఫ్రీ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. 'కేరళ కోసం సల్మాన్ రూ. 12 కోట్లు ప్రకటించినట్టు విన్నా. సల్లూకు ప్రజల ఆశీస్సులు ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ బ్రదర్' అంటూ జావెద్ ట్వీట్ చేశాడు. ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోటి, కునాల్ కపూర్ రూ.1.2 కోట్లు ఇచ్చారు. ఇక అమితాబ్ బచ్చన్, షారుక్‌ఖాన్, కంగనా రనౌత్, సన్నీ లియోన్, అనుష్క శర్మ, రజనీకాంత్‌లాంటి వాళ్లు కూడా విరాళాలు ఇచ్చారు.అయితే దీనిపై ఇప్పటివరకు సల్మాన్‌ఖాన్ మాత్రం స్పందించలేదు.