హిందిలో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చారు స్టార్ మా నిర్వాహకులు. మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా ఆ సీజన్ లో పాల్గొన్న ఇంటి సభ్యులు కూడా చాలా హుందాగా ప్రవర్తించి ఆట ఆడుతూ ప్రేక్షకులను అలరించారు. కాని సీజన్ 2 కి వచ్చే సరికి పరిస్థితులు మారాయి.


మొదటి సీజన్ ఇచ్చిన రిఫరెన్స్ తో ఇంకా జాగ్రత్తగా ఆడుతారనుకున్న ఈ గేం షో కాస్త గొడవల షోగా మారింది. 16 మంది సభ్యులతో మొదలైన బిగ్ బాస్ సెకండ్ సీజన్ ప్రస్తుతం హౌజ్ లో ఆరుగురు సభ్యులతో నడుస్తుంది. మరో రెండు వారాలు మాత్రమే ఉన్న బిగ్ బాస్ లో కౌశల్, తనీష్, గీతా మాధురిల గొడవలు ముదిరి పాకాన పడ్డాయని చెప్పొచ్చు.


అయితే సోమవారం నుండి శుక్రవారం వరకు హౌజ్ మెట్స్ చేసే డ్యామేజ్ అంతటిని కాస్తో కూస్తో మేనేజ్ చేసేందుకు నాని ప్రయత్నిస్తున్నాడు. అయితే సోమవారం, మంగళవారం ఎపిసోడ్స్ చూస్తే మొత్తం గొడవలతోనే బిగ్ బాస్ నడుస్తుందని అనిపిస్తుంది. బిగ్ బాస్ ఆల్రెడీ కౌశల్, తనీష్ లకు వార్నింగ్ ఇచ్చాడు.


అయినా సరే వారు తగ్గట్లేదు. ఇక తాజాగా కౌశల్ తన మీద అందరు ఎటాక్ చేస్తున్న విధానాన్ని చెబుతూ తన దగ్గరకు వచ్చే సరికి అందరు కుక్కల్లా మీద పడతారని అన్నాడు. కుక్కల్లా అనేసరికి హౌజ్ లో ఉన్న మిగతా ఇంటి సభ్యులు ఫైర్ అవుతున్నారు. అప్పటికే రోజు గొడవలతో హాట్ హాట్ గా నడుస్తున్న షో మరింత రచ్చ రచ్చ చేసింది.


ఈ క్రమంలో వారాంతరంలో రావాల్సిన హోస్ట్ నాని ఈ గొడవ పెద్దదవుతుందని భావించి వారం మధ్యలో వచ్చాడని తెలుస్తుంది. కౌశల్, తనీష్, గీతాలకే కాదు మిగతా ఇంటి సభ్యులైన సామ్రాట్, దీప్తి, రోల్ రైడాలకు వార్నింగ్ ఇచ్చాడట. వారం మధ్యలో హోస్ట్ నాని కనిపించడం బిగ్ బాస్ 2 లో మొదటిసారి. అయితే రాఖి సందర్భంగా నాని ఇంట్లోకి వెళ్లి ఆటలాడాడు. అయితే నాని సడెన్ గా ఇంటి సభ్యులకు ఏం చెప్పాడు. దాని తర్వాత పరిస్థితులు ఏమయ్యాయి అన్నది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: