తెరపై సెలబ్రెటీలు ఎంతో అందంగా..ఆరోగ్యంగా కనిపిస్తుంటారు. అబ్బా సినిమా హీరో, హీరోయిన్లు ఎప్పుడు అంత అందంగా..ఆరోగ్యంగా ఉంటారు..ఏం తింటారో..ఎలా ఉంటారో అనుకుంటారు చాలా మంది. కానీ వారు కూడా మనుషులే..వారికీ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ మద్య బాలీవుడ్ సినీ తారలు క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. కొన్ని సార్లు కొంత మంది సెలబ్రిటీలు ఓపెన్‌గా తమ మనసులోని బాధని బయటకు వెళ్ళగక్కుతుంటారు. ఇది విని మనకళ్ళు చెమర్చడం ఖాయం.
తాజాగా గ్లోబల్ స్టార్‌గా తన అందాలతో కుర్రాళ్లను మంత్ర ముగ్దులను చేస్తూ..బాలీవుడ్, హాలీవుడ్ లో సత్తా చాటుతున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా. తాజాగా ప్రియాంక చోప్రా ఐదేళ్ళ వయస్సు నుండే ఆస్తమా నుండి బాధపడుతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది. నాకు ఆస్తమా ఉందనే విషయం దగ్గరగా ఉన్న చాలా మందికి తెలుసు. ఐదేళ్ళ నుండి ఈ వ్యాధితో బాధపడుతున్నాను. మా అమ్మ డాక్టర్ కాబట్టి ఇన్హేలర్ని సూచించింది. కానీ దాన్ని అదే పనిగా వాడితే...అదో వ్యసనం అవుతుందని చాలా మంది అన్నారు.
కాని అలాంటిదేమి లేదు. దాని వలన స్వేచ్చగా ఊపిరి పీల్చుకోవచ్చు. ఆస్తమా నన్ను అదుపు చేసే లోపు దానిని నేను అదుపు చేయాలని అనుకున్నాను. నా వద్ద ఇన్హేలర్ ఉన్నంత వరకు ఆస్తమా నన్ను ఎదగనివ్వకుండా ఆపలేదు అని సోషల్ మీడియా ద్వారా తెలిపింది ప్రియాంక. కాకపోతే ఇన్హేలర్ తో ఆస్తమాని కంప్లీట్‌గా తగ్గించకపోయిన,శ్వాస తీసుకోవడంలో దోహదపడుతుందని వీడియో ద్వారా ప్రియాంక చెప్పుకొచ్చింది.
తాజాగా ఈ విడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ‘ది స్కై ఈజ్ పింక్’ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఈ మద్య తన బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్ మెంట్ అయిన విషయం తెలిసిందే. నవంబర్‌లో లాస్ ఏంజెల్స్‌లో వివాహం చేసుకోనుంది ప్రియాంక.