బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే సల్మాన్ ఖాన్ సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఎన్నో మంచి పనులు చేస్తూ అందరి మనసు దోచాడు. మంచి మానవతావాదిగా అభిమానుల గుండెలలో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఎప్పుడూ కాంట్ర వర్సీలకు కేంద్ర బింధువుగా ఉండే సల్మాన్ ఖాన్ మరో కోణంలో చూస్తే...ఆయన దానగుణం..చూసి ఆశ్చర్యపోతుంటారు.
సినిమాలతో అలరించే సల్మాన్ ఖాన్ పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ, ఆపదలో ఉన్నవారికి తనవంతు సాయం అందిస్తుంటాడు. సల్మాన్ ఖాన్ ముస్లిం అయినా కూడా గణేష్ పండుగ అంటే ఎంతో ఇష్టపడతారు. హిందూ దేవుడయిన గణేష్‌ని తన ఇంట్లో ప్రతిష్టించుకొని కొలుస్తుంటాడు. మొదటి నుంచి హిందూ సాంప్రదాయానికి ఆయన ఎంతో గౌరవం ఇస్తారు. ప్రతి సంవత్సరం తన ఇంట్లో గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్టించి రోజూ పూజలు కూడా చేయిస్తాడు. ఆ సమయంలో తానే స్వయంగా డోల్ వాయిస్తూ అందరిని సంతోష పరుస్తాడు.
తాజాగా సల్మాన్ ఖాన్ కన్నీరు పెట్టుకున్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంగళవారం జైపూర్‌లో దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన సెంటర్‌ని ప్రారంభించాడు. ఈ క్రమంలో దివ్యాంగులు పడుతున్న కష్టాలని చూసి కన్నీరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత పిల్లలతో కలిసి సరదాగా డ్యాన్స్‌లు చేశారు.