టాలీవుడ్ లో ఈ మద్య చిన్న సినిమాలు గా వచ్చినవే టాప్ పోజీషన్లోకి వెళ్లుతున్నాయి. ఇండస్ట్రీలో కాస్త ఫామ్ లో ఉన్న సినిమాలు సైతం రాబట్టని కలెక్షన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి,ఆర్ ఎక్స్ 100, గూఢచారి లాంటి సినిమాలు మంచి విజయాన్ని సాధించి కలెక్షన్లు కూడా బాగా రాబట్టాయి.  ఈ మద్య విజయ్ దేవరకొండ నటించిన ‘గీతాగోవిందం’ ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది.  నేడు ‘ఆర్ ఎక్స్ 100 ’ హీరో కార్తికేయ పుట్టిన రోజు.  ఈ సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్ చేశారు.  


తొలి చిత్రంతోనే హీరో కార్తికేయ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన విలక్షణమైన నటనతో ఆకట్టుకున్నారు.  దక్షిణ భారత సినీ రంగంలో కలైపులి యస్.థాను అంటే ఒక బ్రాండ్. అభిరుచి గల భారీ బడ్జెట్ నిర్మాతగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.  తాజాగా కార్తికేయ తో వినోదాత్మక సినిమాగా తెరకెక్కించబోతున్నారు..కలైపులి యస్.థాను. గతంలో భారీ చిత్రాలను తెరకెక్కించిన థాను.. తుపాకీ, కబాలి, విఐపి2 వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ప్రస్తుతం ఆయన కార్తికేయ హీరోగా సినిమా చేస్తున్నారు.


టిఎన్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. రేపు కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా.. చిత్రబృందం సినిమా టైటిల్ ని విడుదల చేసింది. 'హిప్పీ' అనే టైటిల్ ని రివీల్ చేస్తూ కార్తికేయ స్టిల్ ని వదిలింది. రొమాంటిక్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగుతుందని సమాచారం. 


 1985 నుంచి సినిమా నిర్మాణంలో త‌న‌దైన ముద్ర వేసుకుని తమిళనాట నిర్మాత‌గా, ప్రముఖ పంపిణీదారుడిగా కొన‌సాగుతున్నారు.  ‘ఆర్ఎక్స్100’ తరవాత ఇంత పెద్ద సంస్థలో అవకాశం రావడం తన అదృష్టమని హీరో కార్తికేయ ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి నివాస్ కె.ప్రసన్న సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: