బాలీవుడ్ లో సంజయ్ దత్ హీరోగా స్టార్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ మహేష్ భట్ కూతురు పూజాభట్ హీరోయిన్ గా నటించిన ‘సడక్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 1991లో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ‘సడక్’ సినిమా పూజా తండ్రి మహేష్ భట్ నిర్మించారు. వ్యభిచార గృహంలో పనిచేస్తున్న పూజకు రవి అనే ట్యాక్సీ డ్రైవర్‌తో పరిచయం.. ప్రేమ.. అనంతరం ఆమెను రవి వ్యభిచార గృహం నుంచి తప్పించి తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో బాలీవుడ్ చిత్రంగా నిలిచింది.
90వ దశకంలో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి పది చిత్రాల్లో ఈ సినిమా ఏడో స్థానంలో నిలిచింది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రానికి మహేష్ భట్ దర్శకత్వం వహించారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోంది. ఈ సినిమాతో మహేష్ భట్ దర్శకుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. 1991లో ‘కార్తూస్’ సినిమా తర్వాత మహేష్ భట్ సుమారు 19 ఏళ్లు దర్శకత్వం వదిలి, నిర్మాతగా బిజీ అయ్యారు.
‘సడక్ 2’ సినిమాలో మరోసారి పూజాభట్, సంజయ్ దత్ జంటగా కనిపించనున్నారు. అలియాభట్, ఆదిత్య రాయ్ కపూర్లు జంటగా నటించనున్నారు. ‘సడక్ 2’ సినిమాలో మరోసారి పూజాభట్, సంజయ్ దత్ జంటగా కనిపించనున్నారు. . టీజర్లో ‘సడక్’లోని కొన్ని సన్నివేశాలను చూపించారు. ఈ చిత్రం 2020, మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
And he’s back!To breathe new life into our souls & to breathe more soul into our lives.I thought b’days were about receiving presents Pops & there you go and turn that on it’s head by giving us a gift instead-the gift of Sadak2 & the privilege of being directed by you. Shukriya! pic.twitter.com/A3xZNTtvi8
— Pooja Bhatt (@PoojaB1972) September 20, 2018