రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీలోని కీలకపాత్ర అయిన లక్ష్మి పార్వతి పాత్రను ఎవరు చేస్తారు అన్న ఆసక్తి అందరిలోనూ బాగా పెరిగిపోతోంది. ఈనేపధ్యంలో రకరకాల పేర్లు వర్మ పరిశీలనలోకి వచ్చినా వర్మ మనసులో ఒకనాటి హీరోయిన్ ఆమని ఈపాత్రకు ఎంపిక కాబోతోంది అని వార్తల హడావిడి మొదలు కావడంతో ఈ వార్తలలో ఎంతో కొంత నిజం ఉంటుంది అని భావించారు అంతా.
అయితే అనూహ్యంగా ఈవార్తలు క్రిష్ వరకు చేరడంతో ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన రెండవ పార్ట్ లో ఒక కీలక పాత్రకు ఆమని ఎంపిక చేసి వర్మ ఆలోచనలకు క్రిష్ బ్రేక్ వేసాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి రూపొందింపబడుతున్న రెండవ పార్ట్ ‘మహానాయకుడు’ లో ఆమని ఎన్టీఆర్ పై కవితలు వ్రాసే ఒక రచయిత్రి రూపంలో కనిపిస్తుందని సమాచారం.
తెలుస్తున్న సమాచారం మేరకు లక్ష్మి పార్వతి పాత్రకు దక్షిణాది సినిమా రంగానికి చెందిన ఏహీరోయిన్ ఎంపిక చేసినా ఆమె పై ఒత్తిడిలు ఉంటాయి అన్న నేపధ్యంలో వర్మ లక్ష్మి పార్వతి పాత్రను పోషించగల ఒక బెంగాలి నటి గురించి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వర్మ తీయబోయే ఈమూవీ కథ అంతా లక్ష్మి పార్వతి పాత్ర చుట్టూ తిరిగే నేపధ్యంలో బాగా నటించే సామర్ధ్యం గల నటికోసం వర్మ అన్వేషణ కొనసాగుతున్నట్లు టాక్.
ఇది ఇలా ఉండగా ఈసినిమాకు పనిచేసే సాంకేతిక నిపుణుల విషయంలో కూడ ఎటువంటి రాజీ పడకుండా వర్మ జాతీయ స్థాయిలో పేరుగాంచిన సాంకేతిక నిపుణులను ఈమూవీ గురించి రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకేరోజు ఒక గొప్ప వ్యక్తికి సంబంధించిన బయోపిక్ లు ఒక దానిపై ఒకటి పోటీగా వచ్చే ఏడాది జనవరి 24వ తేదీన విడుదల కాబోతూ ఉండటం చనిపోయి సంవత్సరాలు గడిచిపోయినా చెక్కుచెదరని ఎన్టీఆర్ క్రేజ్ ను సూచిస్తోంది..