ప్రముఖ బాలీవుడ్ నటుడు, మోడల్ అర్జున్ రాంపాల్ తల్లి గ్వెన్ రాంపాల్ మృతి చెందారు. ఆమె గత కొన్ని సంవత్సరాల నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. కాగా నిన్న ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో కన్నుమూశారు. అర్జున్ రాంపాల్ తల్లి మరణ వార్త విని బాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది.
నిన్న సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు..ఆమెకు తుదిసారిగా అంజలి ఘటించడానికి బాలీవుడ్ మొత్తం తరలివచ్చింది. అర్జున్ రాంపాల్ తల్లికి అంత్యక్రియలు నిర్వహించాడు. ప్రస్తుతం కేన్సర్ ఓ అంటువ్యాధిలా తయారైందని అందులో వాపోయాడు. తన తల్లి రొమ్ము కేన్సర్‌తో పోరాడుతున్నట్టు చెప్పాడు.
ప్రస్తుతం తన తల్లి కేన్సర్‌కు చికిత్స తీసుకుంటోందని, త్వరలోనే నయమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని కొన్ని నెలల క్రితం అర్జున్ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు అర్జున్ రాంపాల్. తన స్నేహితుడి సాయంతో లిస్బన్‌లోని చంపాలి మౌద్ ఫౌండేషన్ రీసెర్చ్ సెంటర్‌కు వెళ్లినట్టు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.