టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ నటిగా జ్యోతి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ మద్య ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 1 లో ఇంటి సభ్యురాలిగా మంచి మార్కులే కొట్టేశారు. అంతే కాదు బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతుంది నటి జ్యోతి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హాస్య దర్శకులు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో కొన్ని సినిమాల్లో నటించానని..అయితే 'కితకితలు' సినిమాలో వేషం ఉందని చెబితే మంచి పాత్రే ఇస్తారు గదా అని వెళ్లాను. తీరా నేను వెళ్లి తర్వాత తెలిసింది అది ఒక వ్యాంప్ పాత్ర అని..అయితే ఆ పాత్ర నేను ఒప్పకున్నందుకు కొంత మంది రక రకాలుగా చర్చించుకోవడం మొదలు పెట్టారు.
అంతే కాదు నేను ఆ పాత్రను ఒప్పుకోవడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. దాంతో నాకు ఆ పాత్ర చేయాలనిపించలేదు..వెంటనే వెళ్లి నా పాత్రను కాస్త మార్చమని ఈవీవీ గారిని అడిగాను. 'ఏంటి నేను చెబితే చేయవా?' అన్నారు. అంతే కాదు నన్ను పిలిచి ఈ విషయంపై కోపగించుకున్నారు. వెంటనే నాకు బాధ అనిపించి షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయానని..అప్పటి నుంచి ఆయన సినిమాల్లో నటించలేదని చెప్పింది. మనసుకు నచ్చని పాత్రలో చేయడం చాలా కష్టమని...అలా చేస్తే పాత్రకు న్యాయం చేయలేమని జ్యోతి చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి ఈవీవీగారితో దూరం పెరిగిందని అన్నారు.
జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించానని.. లవ్ పేరుతో నా మనసును కష్టపెట్టిన రెండు మూడు సంఘటనలు జరిగాయి. శుభలేఖల వరకూ వచ్చిన ఒక సంబంధం కూడా కొన్ని కారణాల వలన ఆగిపోయింది. నా చిన్న వయసులోనే దుబాయ్ కి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది..కొంత కాలం తర్వాత మేం విడిపోయాం..మా అబ్బాయి నాతోనే వున్నాడు కదా అనే ఆనందంతో నేను వున్నాను.