టాలీవుడ్ లో పది సంవత్సరాల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమా మాస్ ఎలిమెంట్స్ తో పాటు మెసేజ్ కూడా ఉండాలన్న ఉద్దేశ్యంతో రైతు సమస్యలపై ఓ సామాన్యుడి పోరాటం ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచింది...కలెక్షన్లు కూడా బాగా రాబట్టింది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమా మెగాస్టార్ చిరకాల స్వప్నం..బ్రిటీష్ వారితో ప్రత్యక్షంగా పోరాడిన మొట్టమొదటి తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ మద్య ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. ‘సైరా’ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఉయ్యలవాడ నరిసింహారెడ్డి బ్రిటీష్ వారి చేతిలో మరణిస్తారు..దాంతో చిత్ర కథ పూర్తి అవుతుంది...కానీ ఈ సినిమాలో ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది విప్లవ వీరులు తెలుగు గడ్డపై పుట్టుకు వచ్చారు.
అలాంటి వారిలో మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు ఒకరు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల టాక్. దానికి సంబంధించిన కొన్ని షాట్స్ కూడా తీసినట్లు సమాచారం. అల్లూరి సీతారామరాజుగా చిరంజీవి కనిపించనుండటం ఆయన అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించే విషయం. చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.