నందమూరి కళ్యాణ్ రామ్ గత 12 ఏళ్లుగా ఎంతో కష్టపడి ఎన్ని సినిమాలు చేస్తూ ఉన్నా వాటికి అనుకున్న స్థాయిలో హిట్స్ రావడంలేదు. దీనికితోడు ఈమధ్య కళ్యాణ్ రామ్ సినిమాలను  స్వయంగా జూనియర్ ఎన్టీర్ ప్రమోట్ చేస్తూ ఉన్నా అదృష్టం కలిసిరావడం లేదు ఆమధ్య పటాస్ సక్సస్ కళ్యాణ్ రామ్ కు హిట్ దక్కినా ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. 

అయితే సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ఫ్లాప్స్ ను పట్టించుకోకుండా తనవంతు కృషి చేస్తూ కళ్యాణ్ రామ్ వరసగా సినిమాలలో నటిస్తూనే ఉన్నాడు. ఈమధ్య జూనియర్ తన అన్న కోసం ఒక చిత్రాన్ని చేయాల్సిందిగా మైత్రి మూవీస్ వారిని కోరి ఆసినిమా ద్వారా అయినా కళ్యాణ్ రామ్ ను రక్షించాలి అని ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. 

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటిస్తున్నలేటెస్ట్ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో ఈమూవీలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఈచిత్రంలో హీరోయిన్స్ గా షాలిని పాండే నివేదా థామస్ లు నటిస్తున్నారు. ఫిబ్రవరిలో ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 
ఈచిత్రానికి ఒక నెంబర్ ను టైటిల్ గా ఖరారు చేయాలని భావిస్తునాట్లు సమాచారం.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమా కథలో ‘118’ అనే నెంబర్ కు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. అందుకే అదే నెంబర్ ను సినిమా టైటిల్ గా ఖరారు చేసినట్లుగాతెలుస్తోంది. ఈమధ్య ఈనందమూరి హీరో నటించిన ‘ఎమ్మెల్యే’ ‘నా నువ్వే’లు ఫ్లాప్ అయిన నేపధ్యంలో ఈమూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు కళ్యాణ్ రామ్. అయితే భారీ అంచనాలు లేకుండా లో ప్రొఫైల్ లో నిర్మిస్తున్న ఈమూవీకి సంబంధించి త్వరలో విడుదల కాబోతున్న ఈమూవీ ఫస్ట్ లుక్ ద్వారా ఈమూవీ టైటిల్ ను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈసారి ఈనెంబర్ టైటిల్ ను నమ్ముకున్న కళ్యాణ్ రామ్ కు కనీసం ఇప్పుడైనా అదృష్టం వరిస్తుందేమో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: