సూపర్ స్టార్ మహేష్ బాబు టాప్ హీరో అయినప్పటికీ కుటుంబ బంధాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. తన భార్య పిల్లలతో మాత్రమే  కాకుండా అవకాశం దొరికినప్పుడు చెన్నై వెళ్ళి తన తల్లి తో అదే విధంగా తన అన్న రమేశ్ పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడం మహేష్ అలవాటు. 

ఈ విషయాలు అన్నిటికి మించి మహేష్ తన అమ్మమ్మ అంటే విపరీతమైన ఇష్టం. కొన్ని సంవత్సరాల క్రితం మహేష్ అమ్ముమ్మ చనిపోయినప్పుడు మహేష్ ఆమె పై బెంగతో సుమారు మూడు నెలలు షూటింగ్ లు కూడ మానుకున్నాడు. ఇది ఇలా ఉండగా మహేష్  వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాజమండ్రికి చెందిన ఒక బామ్మపై చూపించిన ప్రేమ ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఆ బామ్మ పేరు సత్యవతి. 

ఆమె మహేష్ వీరాభిమాని అట తనకు మహేష్ బాబును చూడాలని ఉందని అతడితో ఒక ఫొటో తీయించుకోవాలని ఉందని చెప్పడంతో ఆవిషయం తన అభిమానుల ద్వారా తెలుసుకున్న మహేష్ ఆమెను ఈమధ్య తన అభిమానుల సహాయంతో జగ్రత్తగా రాజముండ్రి నుండి  హైదరాబాద్ కు రప్పించి ఆమె  కోరకతీర్చాడు.ప్రస్తుతంమహేష్  రామోజీ ఫిల్మ్ సిటీలో ‘మహర్షి’ చిత్రం షూటింగ్ లో బిజీగాఉన్న నేపధ్యంలో ఆబామ్మను తన షూటింగ్ స్పాట్ కు రప్పించుకుని ఆమెతో చాలా సమయం ఆప్యాయంగా మాట్లాడటమే కాకుండా ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకుని తన అమ్ముమ్మను చూస్తున్నట్లు ఉందని అన్నాడట. 

అంతేకాదు ఆమె కోరుకున్నట్లుగా ఫొటోను కూడా తీసుకుని ఆమెను సంతోషపెట్టాడు. ఆమెకు కొత్త బట్టలు పెట్టడంతో పాటు ఆమెకు సెట్ లోనే బోజనం ఏర్పాటు కూడా చేయించాడట. దీనితో మహేష్ చూపించన ఆప్యాయతకు ఆబామ్మా విపరీతంగా సంతోషించినట్లు తెలుస్తోంది. ఇప్పడు ఈవార్త మహేష్ అభిమానుల మధ్య వైరల్ న్యూస్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: