శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘2.0’ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా పై వస్తున్న వార్తలు మరియు ప్రీ బిజినెస్ సంబంధించిన కలెక్షన్లు రజనీకాంత్ అభిమానుల లో ఆసక్తితో పాటు అంచనాలు కూడా పెంచుతున్నాయి.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న 545 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా బాహుబలి రికార్డులను తిరగరాస్తుంది అని చాలామంది కోలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన వారు పేర్కొంటున్నారు. దీనితో ఎన్నో అంచనాల మధ్య విడుదల కాబోతున్న ‘2.0’ శాటిలైట్ రూపంలో ఇప్పటికే 120 కోట్లు బిజినెస్ చేసినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి.
అంతేకాకుండా డిజిటల్ హక్కులను కూడా కలుపుకుంటే ‘2.0’ నిర్మాతలకు 180 కోట్ల ఆదాయం వచ్చినట్లు టాక్. అన్ని భాషలకూ కలిపి ‘2.0’ శాటిలైట్ హక్కుల్ని రూ.120 కోట్లకు అమ్మినట్లు సమాచారం. ఇది ఇండియన్ సినిమాల్లో రికార్డని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరోవైపు డిజిటల్ హక్కుల రూపంలో ‘2.0’ ఇంకో రూ.60 కోట్లు తెచ్చిపెట్టిందట.
ఇది కూడా రికార్డే. మొత్తంగా బిజినెస్ విషయంలోనూ ఇండియన్ సినిమాల రికార్డుల్ని ‘2.0’ తుడిచిపెట్టేసిందని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. అయితే మరో పక్క త్వరలో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ఆవిష్కారం కాబోతున్న రజనీకాంత్ ఈ సమయంలో కూడా ఇటువంటి బిజినెస్ చేయడం పట్ల చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.