టాలీవుడ్, కోలీవుడ్ లో డ్యాన్స్ మాస్టర్, హీరో, దర్శకుడిగా, నిర్మాతగా విభిన్న రంగాల్లో లారెన్స్ రాఘవ తన ప్రతిభ నిరూపించుకున్నాడు. హర్రర్, కామెడీ కాన్సెప్ట్ తో ‘ముని’ సినిమాలో నటించిన లారెన్స్ అప్పటి నుంచి హర్రర్ సినిమాల్లో ఒక ట్రెండ్ సృష్టించాడు. ముని సీక్వెల్ గా వచ్చిన కాంచన, గంగా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం కాంచన 3 సినిమాలో నటిస్తున్నాడు లారెన్స్. రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు లారెన్స్.
ఎంతో మంది అనాధ పిల్లలను చేరదీశాడు..చాలా మందికి గుండె ఆపరేషన్ చేయించాడు. వృద్దాశ్రమాలు నిర్మించాడు..వాటి మెయింటెన్స్ కూడా చేస్తున్నాడు. ఇక ప్రకృతి విపత్తు వస్తే అందరికన్నా తానే ముందు విరాళాం ప్రకటించడమే కాదు..తన ఫ్యాన్స్ అసోషియేషన్ తో అక్కడ సేవాకార్యక్రమాలు కూడా చేయిస్తాడు. ఈ మద్య తమిళనాడులో ‘గజ’తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈ తుఫాన్ కారణంగా సుమారు 60 మంది వరకు మరణించగా..ఎంతో మంది నిరాశ్రయులయ్యారు.
గజ తుఫాన్ బాధితులను కోలీవుడ్ ఆదుకుంటుంది. ఇప్పటికే హీరోలు , దర్శకులు , నిర్మాతలు , ఇతర నటులు అందరూ స్పందించి తమకు తోచినంత సహాయం చేస్తూనే ఉన్నారు. నడిఘర్ సంఘ అధ్యక్షుడు విశాల్ ఒక ఊరిని దత్తత తీసుకున్నాడు. తాజాగా ఇప్పుడు లారెన్స్ తమ మంచి తనాన్ని చాటుకుంటున్నాడు. ఓ యాభై మందికి ఇండ్లు కట్టించి ఇస్తానని ప్రకటించాడు.
ముఖ్యంగా ఓ ముసలావిడ సర్వస్వం కోల్పోయి బాధపడుతున్న తీరుకి చలించిపోయిన లారెన్స్ మొదటి ఇల్లు ఆ అవ్వకే అంటూ స్టేట్ మెంట్ ఇచ్చేసాడు. బాధితులు నన్ను సంప్రదిస్తే నాకు తోచిన విధంగా ఇండ్లు కట్టిస్తానని , అయితే యాభై మందికి కట్టించి ఇస్తానని ఇల్లు కోల్పోయిన వాళ్ళు నన్ను కలవాలని కోరాడు.