స్టార్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన ‘2.0’చిత్రం బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. కలెక్షన్లు కూడా బాగానే రాబట్టుతుంది.  ఒకప్పుడు శంకర్, రజినీ కాంబినేషన్ లో వచ్చిన ‘రోబో’సీక్వెల్  ‘2.0’చిత్రం.  రోబో చిత్రంలో రజినీ సరసన ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ నటించింది. ఈ చిత్రానికి ఆమె అందాలు ఎంతో ప్లస్ పాయింట్ అయ్యాయి..అంతే కాదు అప్పట్లో ఐష్ కి మంచి పేరు కూడా వచ్చింది.  ఇక  ‘2.0’చిత్రంలో హీరోయిన్ గా అమీజాక్సన్ కి చోటు దక్కడం ఎంతో అదృష్టంగా భావించింది. 
Image result for amy jackson
తెలుగు లో రాంచరణ్ నటించిన ‘ఎవడు’చిత్రంలో తన అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది ఈ బ్రిటీష్ సుందరి.  ఆ తర్వాత శంకర్, విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఐ’చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ చిత్రం మాత్రం అనుకున్న విజయం అందుకోలేక పోయింది.  ‘ఐ’ చిత్రం చేస్తున్నప్పుడు వేరే ఏ చిత్రం చేయకూడదని కండిషన్ పెట్టి ఆమె తో అగ్రిమెంట్ చేయించుకున్నాడట శంకర్. ఇక స్టార్ కాంబినేషన్ కావడంతో  2.0 చిత్రం పై ఎంతో నమ్మకం పెట్టుకుంది ఆ అందాల బామ. 
Related image
ఇక 2.0 చిత్రంలో వశీకర్ కి అసిస్టెంట్ గా వెన్నెల అనే రోబోగా నటించింది.  దాంతో ఈ అమ్మడికి గ్లామర్ గా కనిపించే ఛాన్స్ మాత్రం దక్కలేదు. ఒక పాటలో నటించినప్పటికీ అందాలు అన్ని కవర్ చేసుకోవడంతో తన ఫ్యాన్స్ నిరాశ చెందారు. సినిమాలో అక్కడక్కడా కనిపించే పాత్ర లో నటించింది ఏమీ జాక్సన్.
Image result for amy jackson
అయితే ఈ చిత్రం మొత్తం రజినీ-అక్షయ్ కుమార్ మద్యనే ఎక్కువగా తిరగడంతో అమీజాక్సన్ అసలు ఉందా..లేదా అన్న పరిస్థితి నెలకొంది.  ఎన్నో ఆశలు పెట్టుకొని నటించిన ఈ చిత్రం ఈ బ్రిటీష్ సుందరికి ఏమాత్రం కలిసి రాలేదు. మళ్లీ ఆఫర్లు రావాలంటే..గ్లామర్ ప్రాధాన్యత ఉన్న చిత్రంలో నటించాల్సిందే..లేకపోతే అప్పటివరకు ఖాళీగా కూర్చోవాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: