అందమైన శరీర సౌష్టవం ఉంటే.. ఏ డ్రస్సు వేసినా అందమే. కానీ ఎలాంటి ఆడవారికైనా నప్పే వస్త్ర రాజం ఆరడుగుల చీరే అనడంలో అతిశయోక్తి లేదు. అందాల భామగానే కాకుండా అరుదైన నటిగా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా ఈ మాటే అంటోంది.
తాను ఆధునిక డ్రస్సుల్లో కన్నా చీరలో ఉన్నప్పుడు చాలా కంఫర్ట్ గా ఫీలవుతానంటోంది. చిన్నప్పటి నుంచి చాలా మోడ్రన్ గా పెరగడం వల్ల తనకు చీర కట్టుకునే అవకాశం చాలా ఆలస్యంగా వచ్చిందట. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినట్టు.. అప్పటి నుంచి చీరపై మమకారం తగ్గలేదట.
చీర
కట్టుకున్నప్పుడే తాను
పర్‌ఫెక్ట్ మహిళగా ఫీలవుతానంటోంది.
చీరలో
ఉన్నప్పుడు తాను తన భావాలను
సరిగ్గా ఎక్స్‌ప్రెస్
చేయగలుగుతుందట.
పాపం. చీరపై ఇంత అభిమానమున్నా.. ఓ హీరోయిన్ గా వాటిని ధరించే అవకాశం మాత్రం సినిమాల్లో రేర్ గానే వస్తుందనుకుంటా.. ఇదీ కంగనా రనౌత్ చీర పురాణం.